నోకియా 6, 8పై స్పెషల్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నోకియా ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ నోకియా ఫోన్లపై భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. దాదాపు రూ. 3 వేల వరకు ఆఫర్లను అందింస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా ఈ ఆపర్లు నవంబర్ 13 నుంచి నవంబర్17 మధ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయని ఈ కామర్స్ దిగ్గజం తెలిపింది.

ప్రైమ్ మెంబర్లు, నాన్-ప్రైమ్ మెంబర్లిదరికీ..
ఈ ఆఫర్ కింద ప్రైమ్ మెంబర్లు, నాన్-ప్రైమ్ మెంబర్లిదరికీ రూ.3500 వరకు క్యాష్‌బ్యాక్ అందించనుంది. ఒకవేళ యూజర్లు అమెజాన్ పే, ఇతర పేమెంట్ విధానంలో చెల్లించిన వారికి ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు భిన్నంగా ఉండనున్నాయి.

నోకియా 6
నోకియా 6ను కొనుగోలు చేయాలనుకునే ప్రైమ్ మెంబర్లు, అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.2500 క్యాష్‌బ్యాక్, నాన్-ప్రైమ్ యూజర్లకి రూ.1500 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది.

ఇతర పేమెంట్ విధానాన్ని
ఒకవేళ ప్రైమ్ మెంబర్లు ఇతర పేమెంట్ విధానాన్ని ఎంపికచేసుకుంటే, ఈ క్యాష్‌బ్యాక్‌ను రూ.500ను తగ్గించనుంది. అదే ప్రైమ్ మెంబర్లు ఇతర పేమెంట్ విధానాన్ని ఎంపిక చేసుకుంటే, ఎలాంటి తగ్గింపు ఉండదు.

నోకియా 8
నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే ప్రైమ్ మెంబర్లు, అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందబాటులో ఉండనుంది. ఇతర పేమెంట్ ద్వారా కొనుగోలు చేస్తే ఎలాంటి క్యాష్‌బ్యాక్‌ను ప్రైమ్ మెంబర్లు ఇవ్వదు.

ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై..
అంతేకాక ఈ రెండు స్మార్ట్‌ఫోన్లపై అదనంగా 1000 రూపాయల ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను అందించనుంది. కాగ, నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ధర రూ.17,199, నోకియా 8 స్మార్ట్‌ఫోన్ ధర 36,999 రూపాయలు.


Click it and Unblock the Notifications








