రూ.14,999కే Nokia 6, అమెజాన్ ఎక్స్‌క్లూజివ్? వాళ్లకు రూ.1000 తగ్గింపు

మరికొద్ది గంటల్లో మార్కెట్లో లాంచ్ కాబోతోన్న నోకియా 6 స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ధర రివీల్ అయ్యింది. @IshanAgarwal24 అనే ట్విట్టర్ యూజర్ నోకియా 6 అమెజాన్ ఇండియా పేజీలో లిస్ట్ అయి ఉన్న Screen shotను పోస్ట్ చేసారు. ఈ ఇమేజ్ ప్రకారం నోకియా 6 ధర ఇండియన్ మార్కెట్లో రూ.14,999గా తెలుస్తోంది. ఈ ఫోన్ సంబంధించిన మొదిటి సేల్ జూలై 14న ప్రారంభమవుతుంది. అమెజాన్ ప్రైమ్ యూజర్లు రూ.1000 క్యాష్‌బ్యాక్ పై ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

రూ.14,999కే Nokia 6, అమెజాన్ ఎక్స్‌క్లూజివ్? వాళ్లకు రూ.1000 తగ్గింపు

నోకియా 6 స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

English summary
Nokia 6 Price in India Leaked Before Launch via Amazon Listing. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot