Home
Mobile

నోకియా 6 పై రూ.1500 తగ్గింపు, Amazonలో ఎక్స్‌క్లూజివ్

బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన నోకియా 6 (3జీబి ర్యామ్ వేరియంట్) మొట్టమొదటి సారిగా ధర తగ్గింపును అందుకుంది.

By Bommu Sivanjaneyulu

బెస్ట్ సెల్లింగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన నోకియా 6 (3జీబి ర్యామ్ వేరియంట్) మొట్టమొదటి సారిగా ధర తగ్గింపును అందుకుంది. జూన్, 2017లో లాంచ్ అయిన ఈ ఫోన్ ధరను రూ.14,999 నుంచి రూ.13,499కి తగ్గిస్తూ హెచ్‌ఎండి గ్లోబల్ నిర్ణయం తీసుకుంది. Amazon.inలో ఈ ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతోంది. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. నోకియా 6 (2018) విడుదలకు సిద్ధమవుతోన్న నేపథ్యంలో పాత ఫోన్‌లకు సంబంధించి స్టాక్ క్లియర్ చేసుకునేందుకు హెచ్‌ఎండి గ్లోబల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమే నోకియా 6 (4జీబీ ర్యామ్) మోడల్ కూడా ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. రూ.16,999 ధర‌ట్యాగ్‌తో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది.

నోకియా 6 స్పెసిఫికేషన్స్...

నోకియా 6 స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 6 రఫ్ అండ్ టఫ్..

నోకియా 6 రఫ్ అండ్ టఫ్..

నోకియా నుంచి లాంచ్ అయిన ఫీచర్ ఫోన్‌లు మాత్రమే కాదు స్మార్ట్‌ఫోన్‌లు కూడా అదేస్ధాయిలో పటుత్వాన్ని కలిగి ఉండటం సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు HMD Global అనౌన్స్ చేసిన మూడు నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో నోకియా 6 మాత్రమే మార్కెట్లో దొరుకుతోంది. అది కూడా చైనా మార్కెట్లోనే. 6000 సిరీస్ అల్యుమినియమ్ గ్రేడ్ మెటల్ తో క్రాఫ్ట్ చేయబడిన నోకియా 6 ఫోన్ మరింత మన్నికగాను ధృడంగానూ కనిపిస్తోంది.

అనేక విధాలుగా పరీక్షించి చూసారు..

అనేక విధాలుగా పరీక్షించి చూసారు..

నోకియా 6 ధృడత్వాన్ని పరిశీలించే క్రమంలో జెర్రీరిగ్‌ఎవ్రీ‌థింగ్ అనే యూట్యూబ్ ఛానల్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లను అనేక విధాలుగా పరీక్షించి చూసారు. అయినప్పటికి నోకియా 6 విజయవంతంగా పనిచేస్తోంది.

నోకియా 6 4జిబి ర్యామ్

నోకియా 6 4జిబి ర్యామ్

ఇదిలా ఉంటే ఈ ఏడాది హెచ్‌ఎండి గ్లోబల్ నోకియా 6 4జిబి ర్యామ్ వేరియంట్ ని విడుదల చేసింది. 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.14,999 ఉండగా, 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధరను రూ.16,999గా నిర్ణయించారు.
నోకియా 6 ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, ఎన్‌ఎఫ్‌సీ, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Nokia 6 (3GB) has received a price cut of Rs. 1,500 in India. HMD Global had launched the smartphone in India back in June 2017. It was launched at Rs. 14,999, and now after the price cut, the Nokia 6 is available at Rs. 13,499 on Amazon.in. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X