నోకియా 6.. రేపటి సేల్ కోసం 14 లక్షల మంది రె‘ఢీ’

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి చైనాలో జనవరి 19న జరిగిన మొదటి ఫ్లాష్ సేల్‌లో భాగంగా కేవలం 60 సెకన్ల వ్యవధిలో 100,000 ఫోన్‌లు అమ్ముదైన విషయం తెలిసిందే. JD.com ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబడుతోన్న నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఆరంభం నుంచి భారీ హైప్ క్రియేట్ చేస్తూ వచ్చింది.

Read More : ఆ ఫోన్‌లను ఇండియా బ్యాన్ చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భారీ హైప్ క్రియేట్ చేస్తూ..

మిడ్ రేంజ్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ డిజైన్ చేయబడిన నోకియా 6 ఫోన్ 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, ఆక్టా కోర్ 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ వంటి స్పెసిఫికేషన్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

రెండవ ఫ్లాష్ సేల్ కోసం 14 లక్షల మంది రెడీ

నోకియా 6 ఫోన్‌లకు సంబంధించిన రెండవ ఫ్లాష్ సేల్ జనవరి 26న జరుగబోతోంది. ఈ సేల్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే 14 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నట్లు సమాచారం. మొదటి సేల్‌లో భాగంగా నోకియా 6ను కొనుగోలు చేసేందుకు 12 లక్షల కంటే ఎక్కువ మందే ఆసక్తి చూపినట్లు సమాచారం. నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లను ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నారు.

ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే...

నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లను ప్రస్తుతానికి చైనా మార్కెట్లో మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నారు. ఇండియన్ మార్కెట్లో నోకియా 6 అందుబాటుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి సమచారం లేదు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017లో ఓ స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

నోకియా 6 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.

Geekbench స్కోర్ రివీల్ అయ్యింది..

నోకియా అభిమానుల భారీ అంచనాల మధ్య మార్కెట్లో అయిన నోకియా 6 బెంచ్ మార్క్ స్కోర్‌ను Geekbench విడుదల చేసింది. ఈ ఫలితాల ప్రకారం నోకియా 6 44,517 పాయింట్లను స్కోర్ చేయగలిగింది.

ఈ స్కోర్ ప్రకారం చూస్తే..

Geekbench వెల్లడించిన స్కోర్ ప్రకారం చూస్తే, నోకియా 6 ఫోన్‌లో హై-ఎండ్ గేమ్స్ అలానే యాప్స్‌ను రన్ చేయటం కొద్దిగా కష్టమే. ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే..? నోకియా 6 ఫోన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తోంది.

హై-ఎండ్ ఫోన్ ఏమి కాదు..

ముందుగా పేర్కొన్నట్లుగానే నోకియా 6, హై-ఎండ్ ఫోన్ ఏమి కాదు. ఇదో మిడ్ రేంజ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్. మరి ఇలాంటి ఫోన్ ను ఐఫోన్ 7, వన్‌ప్లస్ 3టీ వంటి హైఎండ్ ఫోన్‌లతో పోల్చి చూడటం అంతగా కరెక్ట్  కూడా కాదు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 6 receives 1.4 million registrations ahead of the second flash sale. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot