24 గంటల్లో 2,50,000, నోకియాకు క్రేజ్ తగ్గలేదు

HMD గ్లోబల్ ద్వారా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన నోకియా తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 6ను కొద్ది రోజుల క్రితం చైనా మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్స్ నిమిత్తం JD.comలో అందుబాటులో ఉంచిన ఈ ఫోన్ కోసం మొదటి రోజే 2,50,000 మంది ఆసక్తి కనబర్చినట్లు తెలుస్తోంది. జనవరి 19 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. ధర 1699 CNY (మన కరెన్సీలో రూ.16,750).

24 గంటల్లో 2,50,000, నోకియాకు క్రేజ్ తగ్గలేదు

Read More : స్మార్ట్‌ఫోన్‌లు..షాకింగ్ నిజాలు

Android Nougat ఆపరేటింగ్ సిస్టం రన్ అవుతున్న ఈ ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి (1920x 1080పిక్సల్స్ ) డిస్‌ప్లేతో వస్తుంది. మెటాలిక్ సైడ్స్‌తో వస్తోన్న ఈ ఫోన్ ముందు భాగంలో గుండ్రని దీర్ఘచతురస్రాకార ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసారు. Qualcomm Snapdragon 430 సాక్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్ 4జీ, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. (ప్రత్యేకతలు : ఫేస్ డిటెక్షన్ ఆటోఫోస్, డ్యుయల్ టోన్ ఎల్‌ఈడి ఫ్లాష్).

మెసెంజర్ యాప్‌ను వెంటనే రీస్టార్ట్ చేయండి

English summary
Nokia 6 receives 250,000 registrations in 24 Hours. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot