రికార్డులు బద్దలు కొడుతున్న నోకియా 6

ఆండ్రాయిడ్ బాట పట్టిన నోకియా మంచి రోజులొచ్చినట్లు కనిపస్తోంది. HMD Global గూటికి చేరిన తరువాత నోకియా లాంచ్ చేసిన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 6ను కొనుగోలు చేసేందుకు 11 లక్షల మంది రిజిస్టర్ అయ్యారు.

రికార్డులు బద్దలు కొడుతున్న నోకియా 6

Read More : జియో రూ.999 ఫోన్ ఇదే!

ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. చైనా మార్కెట్లో నోకియా 6కు స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి మొదటి ఫ్లాష్‌సేల్ జనవరి 19న JD.comలో జరుగబోతోంది. ఈ సేల్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్స్ ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనూ 2,50,000 మంది ఆసక్తి చూపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లేకు 2.5డీ గొరిల్లా గ్లాస్ రక్షణ కవచంలా నిలుస్తుంది. ఈ డిస్‌ప్లేలో అమర్చిన పోలరైజర్ లేయర్ సన్‌లైట్ కండీషన్‌లలోనూ యూజర్‌కు క్లియర్ కట్ అనుభూతులను చేరువచేయగలదని కంపెనీ చెబుతోంది.

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబి ర్యామ్

ధరకు తగ్గట్టుగానే నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 4జీబి ర్యామ్ అలానే 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోంది. ర్యామ్ ఎక్కువుగా ఉన్న నేపథ్యంలో గేమర్స్ అలానే హెవీ యూజర్స్‌కు ఈ ఫోన్ చక్కటి ఆప్షన్ కావొచ్చు. ఫోన్‌లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా డివైస్ స్టోరేజ్‌ను మరో 64జీబి వరకు పొడిగించుకోవచ్చు.

కెమెరా విభాగం..

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 లెన్స్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ ముందుగా 8 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరాను నోకియా నిక్షిప్తం చేసింది. మొత్తానికి ఈ రెండు కెమెరాలు లీఇకో, షియోమీ, వివో బ్రాండ్‌లతో పోటీ పడే విధంగా ఉన్నాయి.

డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్లు

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ డ్యుయల్ యాంప్లిఫయర్స్‌తో కూడిన డ్యుయల్ డాల్బీ అట్మోస్ స్పీకర్లతో వస్తోంది. తద్వారా ఈ ఫోన్ నుంచి హైక్వాలిటీ సౌండ్‌ను ఆస్వాదించే వీలుంటుంది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం..

నోకియా 6 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. అంటే, హైక్వాలిటీ ఆండ్రాయిడ్ అనభూతులను ఈ ఫోన్ ద్వారా ఆస్వాదించవచ్చు.

స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్

అయితే నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లో నిక్షిప్తం చేసిన క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్ లో-ఎండ్ కాన్ఫిగరేషన్‌తో నిరుత్సాహపరుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. చైనాకు చెందిన JD.com నోకియా 6 ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. ధర 1699 CNY (మన కరెన్సీలో రూ.16,750).

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 6 Registrations Cross 1 Million.Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot