నోకియా 6 కోసం 10 లక్షల రిజిస్ట్రేషన్స్

సేల్ తేదీ దగ్గర పడేలోపు ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది.

|

ఆగష్టు 23న అమెజాన్ ఇండియాలో జరిగే నోకియా 6 మొదటి ఫ్లాష్ సేల్ కోసం ఇప్పటికే 10 లక్షల మంది యూజర్లు రిజిస్టర్ అయిననట్లు సమాచారం. సేల్ తేదీ దగ్గర పడేలోపు ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. జూలై 14 నుంచి ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ప్రారంభమయ్యింది. అయితే మొదటి సేల్‌లో ఎన్ని నోకియా 6 యూనిట్లను అందుబాటులో ఉంచుతారన్నది తెలియాల్సి ఉంది.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్ ఏది..?బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్ ఏది..?

మొదటి సేల్ కోసం పలు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు

మొదటి సేల్ కోసం పలు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లు

ఇండియన్ మార్కెట్లో నోకియా ధరను రూ.14,999గా ఫిక్స్ చేసారు. నోకియా 6 మొదటి సేల్‌ను పురస్కరించుకుని అమెజాన్ ఇండియా పలు ఎక్స్‌క్లూజివ్ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. నోకియా 6ను ముందుగా సొంతం చేసుకునే అమెజాన్ ప్రైమ్ యూజర్లకు క్యాష్ బ్యాక్ క్రింద రూ.1000 లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ వారివారి అమెజాన్ పే బ్యాలన్స్ అకౌంట్‌లలో యాడ్ అయిపోతుంది.

వొడాఫోన్ యూజర్లకు 45జీబి 4జీ డేటా..

వొడాఫోన్ యూజర్లకు 45జీబి 4జీ డేటా..

నోకియా 6 కొనుగోలుదారులకు కైండిల్ ఈ-బుక్స్ కొనుగోలు పై 80% రాయితీలతో పాటు వొడాఫోన్ తరపు నుంచి 45జీబి 4జీ డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా వీరికి మేక్ మై ట్రి తరుపు నుంచి హోటల్స్ పై రూ.1800, విమాన టికెట్ల పై రూ.700 వరకు డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి.

నోకియా 6  స్పెసిఫికేషన్స్..

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా 6 రఫ్ అండ్ టఫ్..

నోకియా 6 రఫ్ అండ్ టఫ్..

నోకియా నుంచి లాంచ్ అయిన ఫీచర్ ఫోన్‌లు మాత్రమే కాదు స్మార్ట్‌ఫోన్‌లు కూడా అదేస్ధాయిలో పటుత్వాన్ని కలిగి ఉండటం సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటి వరకు HMD Global అనౌన్స్ చేసిన మూడు నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో నోకియా 6 మాత్రమే మార్కెట్లో దొరుకుతోంది. అది కూడా చైనా మార్కెట్లోనే. 6000 సిరీస్ అల్యుమినియమ్ గ్రేడ్ మెటల్ తో క్రాఫ్ట్ చేయబడిన నోకియా 6 ఫోన్ మరింత మన్నికగాను ధృడంగానూ కనిపిస్తోంది.

అనేక విధాలుగు టెస్ట్ చేసారు..

అనేక విధాలుగు టెస్ట్ చేసారు..

నోకియా 6 ధృడత్వాన్ని పరిశీలించే క్రమంలో JerryRigEverything అనే యూట్యూబ్ ఛానల్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లను అనేక విధాలుగా పరీక్షించి చూసారు. అయినప్పటికి నోకియా 6 విజయవంతంగా పనిచేస్తోంది.

నోకియా 6 డ్యూరబులిటీ టెస్ట్ వీడియో

నోకియా 6 డ్యూరబులిటీ టెస్ట్ వీడియో

Best Mobiles in India

English summary
Nokia 6 registrations cross 1 million on Amazon India, ahead of August 23 sale. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X