నిమిషంలో అమ్ముడుపోయిన నోకియా 6 ఫోన్‌లు

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నోకియాకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి జనవరి 19న చైనాలో జరిగిన మొదటి ఫ్లాష్‌సేల్‌లో భాగంగా ఒకేఒక్క నిమిషంలో మొత్తం ఫోన్‌లన్నీ అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సేల్‌లో భాగంగా నోకియా 6 ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు 11 లక్షల మందికి పైగా రిజిస్టర్ అయ్యారు. మొదటి సేల్‌లో ఎన్ని ఫోన్‌లు అమ్ముడయ్యాయన్నది తెలియాల్సి ఉంది.

Read More : శక్తివంతమైన బడ్జెట్ ఫోన్.. రెడ్మీ నోట్ 4 రివ్యూ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Anzhuo తెలిపిన వివరాలు ప్రకారం..

చైనా న్యూస్ ఏజెన్సీ Anzhuo తెలిపిన వివరాలు ప్రకారం.. నోకియా 6 ఫోన్‌లకు సంబంధించిన సేల్ స్ధానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 10:06 నిమిషాలకు JD.comలో ప్రారంభమైంది. అందుబాటులో ఉంచిన యూనిట్స్ అన్ని 10:07 నిమిషాలకే అమ్ముడు పోవటంతో సేల్ ముగిసింది. రెండో ఫ్లాష్ జరిగే తేదీని త్వరలోనే వెల్లడించనున్నారు.

ఫోన్‌లో Slow Motion వీడియోలను రికార్డ్ చేయటం ఎలా

నోకియా 6 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీఎంట్రీ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొబైల్ ఫోన్ మార్కెట్‌లలో ప్రముఖంగా వినిపించే పేరు ‘నోకియా'. దశాబ్ధాల కాలంగా అత్యుత్తమ మొబైల్ ఫోన్‌లను పరిచయం చేస్తున్న ఈ ఫిన్‌ల్యాండ్ మొబైల్ మేకర్ కొన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది.

4జీబి ర్యామ్‌తో Redmi Note 4 లాంచ్ అయ్యింది, రూ.9,999 నుంచి..

1985లో ప్రారంభం..

ఫిన్‌ల్యాండ్ ముఖ్య కేంద్రంగా నోకియా కంపెనీని 1985లో ప్రారంభించారు. తొలిగా పేపర్ మిల్‌తో ప్రారంభమైన నోకియా ప్రస్థానం ఆ తరువాత రబ్బర్ పరిశ్రమకు విస్తరించింది. 19వ శతాబ్ధంలో టెలీగ్రాఫ్ ఇంకా టెలీఫోన్ కేబుళ్లను ఉత్పత్తి చేయటం నోకియా ప్రారంభించింది. తరువాతి క్రమంలో మొబైల్ ఫోన్‌ల తయారీ పై దృష్టిని కేంద్రీకరించింది.

మంచు టైర్లు, రబ్బర్ బూట్లు

మంచు టైర్లు, రబ్బర్ బూట్లు, గ్యాస్ మాస్క్స్, టెలివిజన్ సెట్స్, ల్యాప్‌టాప్ కంప్యూటర్స్, నెట్‌వర్క్ కాంపోనెంట్స్, హైక్రోఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించి అనేక ఉత్పత్తులను నోకియా గత కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తోంది.

మార్చి 31 తరువాత జియో నుంచి మరో బంపర్ ఆఫర్..?

తొలి మొబైల్ నెట్‌వర్క్‌

ఫిన్‌ల్యాండ్ ప్రాంతానికి సంబంధించి తొలి మొబైల్ నెట్‌వర్క్‌ను నోకియా 1971లో ప్రారంభించింది. 1978నాటికి ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించింది.

‘లూమీ' అనే పదం నుంచి

నోకియా నుంచి ఆ మధ్య కాలంలో విడుదలైన లూమియా సిరీస్ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. లూమియా అనే పదాన్ని ‘లూమీ' అనే పదం నుంచి నోకియా సేకరించనట్లు తెలుస్తోంది. ఫిన్నిష్ భాష ప్రకారం లూమీ అంటే మంచు అని అర్థం.

స్మార్ట్‌ఫోన్‌కు పెన్‌డ్రైవ్ కనెక్ట్ చేయటం ఎలా..?

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 6 sells out in just 1 minute in China. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot