నిమిషంలో అమ్ముడుపోయిన నోకియా 6

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నోకియా 6కు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి అమెజాన్ ఇండియాలో నిన్న జరిగిన మొదటి ఫ్లాష్‌సేల్‌లో భాగంగా ఒకేఒక్క నిమిషంలో మొత్తం ఫోన్‌లన్నీ అమ్ముడుపోయినట్లు హెచ్ఎండి గ్లోబల్ వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా నోకియా 6 ఫోన్‌ను సొంతం చేసుకునేందుకు 10 లక్షల మందికి పైగా రిజిస్టర్ అయ్యారు. ఈ సేల్‌లో ఎన్ని ఫోన్‌లు అమ్ముడయ్యాయన్నది తెలియాల్సి ఉంది.

Read More : సాయంత్రం 5 గంటల నుంచి జియోఫోన్ బుకింగ్స్ ప్రారంభం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తరువాతి సేల్ ఆగష్టు 30న జరుగుతుంది..

నోకియా 6 తదుపరి సేల్ ఆగష్టు 30న జరుగుతుంది. ఈ సేల్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. Amazon Pay ద్వారా నోకియా 6ను కొనుగోలు పై అమెజాన్ ప్రైమ్ యూజర్లకు రూ.1000 డిస్కౌంట్‌ను అమెజాన్ ఇండియా ఆఫర్ చేస్తోంది. కైండిల్ ఈ-బుక్స్ పై 80% రాయితీ అలానే రూ.2500 మేక్ మై ట్రిప్ డిస్కౌంట్, 45జీబి వొడాఫోన్ ఉచిత 4జీ డేటా వంటి లాంచ్ ఆఫర్స్, ఈ ఫోన్ కొనుగోలు పై సిద్ధంగా ఉన్నాయి.

నోకియా 6 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్పాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై,NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 3000 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (ఆర్టీ బ్లాక్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

నోకియా గురించి క్లుప్తంగా...

ఫిన్‌ల్యాండ్ ముఖ్య కేంద్రంగా నోకియా కంపెనీని 1985లో ప్రారంభించారు. తొలిగా పేపర్ మిల్‌తో ప్రారంభమైన నోకియా ప్రస్థానం ఆ తరువాత రబ్బర్ పరిశ్రమకు విస్తరించింది. 19వ శతాబ్ధంలో టెలీగ్రాఫ్ ఇంకా టెలీఫోన్ కేబుళ్లను ఉత్పత్తి చేయటం నోకియా ప్రారంభించింది. తరువాతి క్రమంలో మొబైల్ ఫోన్‌ల తయారీ పై దృష్టిని కేంద్రీకరించింది.

మంచు టైర్లు, రబ్బర్ బూట్లు..

మంచు టైర్లు, రబ్బర్ బూట్లు, గ్యాస్ మాస్క్స్, టెలివిజన్ సెట్స్, ల్యాప్‌టాప్ కంప్యూటర్స్, నెట్‌వర్క్ కాంపోనెంట్స్, హైక్రోఎలక్ట్రిక్ పవర్‌కు సంబంధించి అనేక ఉత్పత్తులను నోకియా గత కొన్ని సంవత్సరాలుగా తయారు చేస్తోంది.

తొలి మొబైల్ నెట్‌వర్క్‌

ఫిన్‌ల్యాండ్ ప్రాంతానికి సంబంధించి తొలి మొబైల్ నెట్‌వర్క్‌ను నోకియా 1971లో ప్రారంభించింది. 1978నాటికి ఈ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో విస్తరించింది.

లుమియా అనే పదం ఎలా వచ్చిందంటే..?

నోకియా నుంచి ఆ మధ్య కాలంలో విడుదలైన లుమియా సిరీస్ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న విషయం తెలిసిందే. లూమియా అనే పదాన్ని ‘లుమీ' అనే పదం నుంచి నోకియా సేకరించనట్లు తెలుస్తోంది. ఫిన్నిష్ భాష ప్రకారం లూమీ అంటే మంచు అని అర్థం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 6 sold out in less than one minute in first sale. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot