నోకియా 6 Vs కూల్ ప్లే 6, రూ.15000లో ఏది బెస్ట్ స్మార్ట్‌ఫోన్?
నోకియా 6 సేల్ ఇప్పటికే అమెజాన్ ఇండియాలో ప్రారంభం కాగా కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 ఫోన్ సెప్టంబర్ 4 నుంచి అందుబాటులో ఉంటుంది.
ఇండియన్ యూజర్లు కోరుకుంటున్న ధరల్లో, బెస్ట్ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తూ చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు దూసుకుపోతున్నాయి. షియోమి, లెనోవో, కూల్‌ప్యాడ్ వంటి కంపెనీలు తమ నోట్ సిరీస్ ఫోన్‌లతో మార్కెట్‌ను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి.

Nokia 6 Vs Coolpad Cool Play 6
కూల్‌ప్యాడ్ కంపెనీ తాజాగా కూల్ ప్లే 6 (Cool Play 6) పేరుతో ఓ శక్తివంతమైన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. రూ.14,999 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 6 (Nokia 6) నుంచి పోటీ ఎదరవుతోంది. ఈ రెండు ఫోన్‌ల మధ్య Spec Comparisonను పరిశీలించినట్లయితే...

డిజైన్ ఇంకా డిస్‌ప్లే
నోకియా 6 అలానే కూల్ ప్లే 6 స్మార్ట్‌ఫోన్‌లు పూరి మెటల్ యునిబాడీ డిజైన్‌తో వస్తున్నాయి. డిస్‌ప్లే అంశాన్ని పరిశీలించినట్లయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే ప్యానల్స్‌తో వస్తున్నాయి. డిజైనింగ్ పరంగా కూల్ ప్లే 6తో పోలిస్తే నోకియా 6 స్మార్ట్‌ఫోన్ డిజైనింగ్ పరంగా ప్రొఫెషనల్ లుక్‌ను కలిగి ఉంటుంది.

హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే
ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే నోకియా 6 కేవలం ఎంట్రీ-లెవల్ హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్స్‌తో వస్తోంది. ఈ ఫోన్‌లో పొందుపరిచిన Snapdragon 430 SoC, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు కూల్ ప్లే 6 ఫోన్‌లో పొందుపరిచిన Snapdragon 653 SoC, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ఫీచర్లతో ఏమాత్రం పోటీపడలేవు.

కెమెరా అంశాలను పరిశీలించినట్లయితే
నోకియా 6 స్మార్ట్ ఫోన్ 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్‌తో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది. ఇదే సమయంలో కూల్ ప్లే 6 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫసింగ్ కెమెరాతో పాటు 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. కెమెరా స్పెక్స్ పరంగా నోకియా 6తో పోలిస్తే కూల్ ప్లే 6 స్మార్ట్‌ఫోన్ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది.

సాఫ్ట్‌వేర్
సాఫ్ట్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి.

బ్యాటరీ
బ్యాటరీ విషయానికి వచ్చేసరికి కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 ఫోన్ 4000mAh బ్యాటరీతో వస్తోంది. ఇదే సమయంలో నోకియా 6 ఫోన్ 3000mAh బ్యాటరీతో వస్తోంది.

ధరలు..
ధర విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు రూ.14,999 ధర ట్యాగ్‌లతో లభ్యమవుతున్నాయి. నోకియా 6 సేల్ ఇప్పటికే అమెజాన్ ఇండియాలో ప్రారంభం కాగా కూల్‌ప్యాడ్ కూల్ ప్లే 6 ఫోన్ సెప్టంబర్ 4 నుంచి అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








