'సింబియన్ బెల్లీ' ఓఎస్‌తో నోకియా 603 స్మార్ట్ ఫోన్

Posted By: Staff

'సింబియన్ బెల్లీ' ఓఎస్‌తో నోకియా 603 స్మార్ట్ ఫోన్

నోకియా ఒకప్పుడు సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కొన్ని వేల కొద్ది మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసి గ్లోబల్ మార్కెట్లో నెంబర్ వన్ స్దానాన్ని కైవసం చేసుకుంది. కానీ ఇటీవల కాలంలో విడుదలైన గూగుల్ ఆండ్రాయిడ్, శ్యామ్‌సంగ్ గెలాక్సీ సిరిస్ లాంటి స్మార్ట్ ఫోన్స్ దెబ్బకి నోకియా బిజినెస్ కొద్దిగా వెనకబడింది. తిరిగి తన పూర్వవైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు నోకియా కొత్తగా మార్కెట్లోకి సింబియన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రూపొందించిన నోకియా 603 స్మార్ట్ ఫోన్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది.

నోకియా 603 స్మార్ట్ ఫోన్ సింబియన్ టచ్ స్క్రీన్ టెక్నాలజీతో యూజర్స్‌ని ఇట్టే మంత్రముగ్దుల్ని చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా నోకియా 603 స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి కొత్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో రానుంది. నోకియా 603 స్మార్ట్ ఫోన్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 1GHz ARM ఆధారిత CPU ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. నోకియా 603 స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్‌ని ఈజీగా యాక్సెస్ చేసుకునేందుకు గాను సింబియన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఇందులో ఇనిస్టాల్ చేయడం జరిగింది.

నోకియా 603 స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 5 మెగా ఫిక్సల్ కెమెరాని నిక్షిప్తం చేయడం జరిగింది. స్క్రీన్ సైజు రిజల్యూషన్ 360*640 ఫిక్సల్‌గా రూపొందించడం జరిగింది. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై-పై లను కూడా నోకియా 603 సపోర్ట్ చేస్తుంది. ప్రయాణాలలో పాటలను వినేందుకు గాను ఇందులో రేడియోని ఆర్‌డిఎస్ టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. ఇందులో ఉన్న జిపిఎస్ కనెక్షన్ ద్వారా నోకియా ఓవిఐ మ్యాప్స్‌కి కనెక్ట్ అవ్వోచ్చు.

నోకియా 603 స్మార్ట్ ఫోన్‌ని బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. వీటితో పాటు నోకియా 603 మొబైల్ మైక్రో సిమ్ కార్డ్స్‌ని సపోర్ట్ చేసే టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా 603 ధర సుమారుగా రూ 15,000/- వరకు ఉండవచ్చునని అంచనా..

నోకియా 603 మొబైల్ ప్రత్యేకతలు:

* 1GHz Processor
* Symbian Belle operating system
* Capacitive Touchscreen Display
* 360

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting