ప్రభంజనానికి స్ర్కిప్ట్ సిద్దం..?

Posted By: Prashanth

ప్రభంజనానికి స్ర్కిప్ట్ సిద్దం..?

 

ప్రఖ్యాత మొబైల్ ఫోన్‌లు తయారీ సంస్థ నోకియా (Nokia) ఇండియాలో ప్రవేశపెట్టబోతున్న స్మార్ట్‌ఫోన్ లూమియా 610కి సంబంధించి పలు విషయాలను వెల్లడించింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఏప్రిల్ నాటికి నోకియా స్టోర్‌లలో లభ్యం కానుంది. విండోస్ ఫోన్ 7.5 ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం ఆధారితంగా ఈ స్మార్ట్‌ఫోన్ రన్ అవుతుంది.

ప్రధాన ఫీచర్లు:

3.7 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్, విండోస్ ఫోన్ 7.5 ట్యాంగో ఆపరేటింగ్ సిస్టం, 800 మెగాహెడ్జ్ సింగిల్‌కోర్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, హై క్వాలిటీ ఆడియో మరియు వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, 3జీ కనెక్టువిటీ, ఎడ్జ్, జీపీఆర్ఎస్, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ 2.0, ఇంటర్నల్ మెమరీ 8జీబి, ఎక్సటర్నల్ మెమెరీ 16జీబి, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), బ్యాటరీ స్టాండ్ బై 580 గంటలు, ధర రూ.12,000.

ఫోన్‌లో నిక్షిప్తం చేసిన అదనపు అప్లికేషన్‌లు ఫోటో ఎడిటర్, ప్రిడిక్టివ్ టెక్స్ట్ ఇన్‌పుట్, వాయిస్ మెమో, క్యాలెండర్, పీసీ సింక్రనైజేషన్ వంటి అంశాలు మరింత లబ్ధి చేకూరుస్తాయి. ఫోన్‌లో పొందుపరిచిన హెచ్‌టిఎమ్‌ఎల్ బ్రౌజర్ ద్వారా వినియోగదారుడు వివిధ గేమింగ్ మరియు సోషల్ నెట్‌వర్కింగ్ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేుసుకోవచ్చు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot