నోకియా ఎక్స్7 లాంచ్ అయ్యింది, ప్రత్యేకతలివే!

హెచ్‌ఎండి గ్లోబల్ నుంచి మరో శక్తివంతమైన ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. నోకియా ఎక్స్7 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

|

హెచ్‌ఎండి గ్లోబల్ నుంచి మరో శక్తివంతమైన ఫోన్ చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. నోకియా ఎక్స్7 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. షిప్పింగ్స్ వచ్చే వారం నుంచి ప్రారంభమవుతాయి. చైనా మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా 7.1 ప్లస్ అని కూడా పిలుస్తున్నారు.

 
Nokia 7.1 Plus

ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ వచ్చేసరికి 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటుంది. రెండవ వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంటుంది. బేస్ వేరియంట్ ధర 1,699 Yuanలు (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.18,000). ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

నోకియా ఎక్స్7 స్పెసిఫికేషన్స్...

నోకియా ఎక్స్7 స్పెసిఫికేషన్స్...

6.18 అంగుళాల నాట్చ్ స్ర్కీన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ టు ఆండ్రాయిడ్ 9.0 పై), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 710 చిప్‌సెట్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్, 12 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ విత్ 4జీ వోల్ట్ సపోర్ట్, డార్క్ రెడ్ ఇంకా నైట్ బ్లూ కలర్ వేరియంట్స్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

 

 

 

బడ్జెట్ యూజర్ల కోసం నోకియా 3.1 ప్లస్

బడ్జెట్ యూజర్ల కోసం నోకియా 3.1 ప్లస్

కొద్ది రోజల క్రితమే నోకియా 3.1 ప్లస్ పేరిట మరో బడ్జెట్ సెంట్రిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌ఎండి గ్లోబల్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ధర రూ.11,499. అక్టోబర్ 19 నుంచి సేల్ ప్రారంభమవుతుంది. నోకియా మొబైల్ షాప్ నుంచి ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. .

 

 

ఆండ్రాయిడ్ వన్ బ్రాండింగ్‌..
 

ఆండ్రాయిడ్ వన్ బ్రాండింగ్‌..

ఆండ్రాయిడ్ వన్ బ్రాండింగ్‌తో వస్తోన్న నోకియా 3.1 ప్లస్‌కు మెటాలిక్ బాడీ స్పెషల్ లుక్‌ను తీసుకువచ్చింది. ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి.. 6 ఇంచ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే (1440 x 720 పిక్సల్స్) విత్ 18:9 స్ర్కీన్ టు బాడీ రేషియో, ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 400జీబి వరకు విస్తరించుకునే అవకాశం,.

 

 

కెమెరా, బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ ఫీచర్స్..

కెమెరా, బ్యాటరీ ఇంకా కనెక్టువిటీ ఫీచర్స్..

13 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3500ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4G VoLTE, బ్లుటూత్ 4.1, వై-ఫై, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్బీ, డ్యుయల్ సిమ్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్), ఫోన్ చుట్టుకొలత 156.68 x 76.44 x 8.19 మిల్లీ మీటర్లు, బరువు 180 గ్రాములు.

Best Mobiles in India

English summary
Nokia 7.1 Plus (Nokia X7) launched in China, prices start at Rs 18,000.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X