2018లో నోకియా 7 లాంచ్?

By: Madhavi Lagishetty

HMD గ్లోబల్ వచ్చే ఏడాది నోకియా 7 స్మార్ట్ ఫోన్ను లాంచ్ చేయబోతోంది . చైనా వెబ్ సైట్ల నుంచి వస్తున్న రూమర్స్ ప్రకారం...వచ్చేఏడాది(2018)లో ప్రపంచవ్యాప్తంగా నోకియా 7 ఫోన్ను విడుదుల చేయాలని హెచ్ఎండి గ్లోబల్ సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ అంతర్జాతీయ వేరియంట్ మోడల్ సంఖ్య TA-1041 ద్వారా గుర్తించబడుతుంది.

2018లో నోకియా 7 లాంచ్?

ఈఏడాది అక్టోబర్లో అధికారికంగా నోకియా 7 ఫోన్ లాంచ్ అయ్యింది. కానీ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటులో లేదు. అయినప్పటికీ నోకియా 6 కూడా ఇలానే లాంచ్ అయ్యింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో చేరుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టింది. కాబట్టి ఇప్పుడు నోకియా 7 కూడా అలాగే కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.

ఇప్పటివరకు వస్తున్న రిపోర్టులన్నీ నిజమైతే...ప్రపంచమార్కెట్లో నోకియా 7 రిలీజ్ అయితే చైనా ఎక్స్ క్లూజివ్ గా నిలవనుంది. అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుందనే సమాచారం అధికారికంగా ఇప్పటికీ వెలువడలేదు. ఇప్పటికే వచ్చే ఏడాది జనవరి 19న అంతర్జాతీయ ఈవెంట్ను నిర్వహించాలని హెచ్ఎండి గ్లోబల్ ప్రకటించింది.

కానీ కంపెనీ ఖచ్చితంగా రిలీజ్ చేస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు వస్తున్నవన్నీ రూమర్స్ మాత్రమే. అయినప్పటికీ నోకియా 7 గ్లోబల్ వేరియంట్ అనేది జనవరి 19న ప్రకటించబడుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

అన్న చేతికి తమ్ముడు ఆస్తులు, జియోతో ఆర్‌కామ్ చెట్టాపట్టాల్ !

నోకియా 7 ఇండియాకు వస్తుందా లేదా అనేది చెప్పలేం. ఎందుకంటే గతంలో హెచ్ఎండి గ్లోబల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫిసర్ పక్కా రంటాల మాట్లాడుతూ...నోకియా7 చైనీస్ యూజర్ల కోసం మాత్రమే డిజైన్ చేయబడింది. కాబట్టి ప్రస్తుతానికి ఇండియాలో లాంచ్ చేయడానికి ఎలాంటి ప్లాన్స్ లేవు. కానీ మళ్లీ గ్లోబల్ వేరియంట్ కొన్ని ట్వీక్స్ తో వస్తాయి మరియు చివరకు భారతదేశంలో కూడా రిలీజ్ చేయబడుతుంది.

ప్రస్తుతం చైనాలో రెండు వేరియంట్లలో స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉంది. బేస్ వేరియంట్ RMB 2,499(24,443రూపాయలు) హై ఎండ్ వేరియంట్ RMB 2,699(26,399)రూపాయలకు అందుబాటులో ఉంది.

డివైస్ యొక్క స్పేసిఫికేషన్స్ చూసినట్లయితే నోకియా 7, 5,20అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ల్పేతోపాటు 1080పిక్సెల్స్ , 1920పిక్సెల్స్ రిజల్యూషన్ తోపాటు ప్రతిఅంగుళానికి 423పిక్సెలస్ పిపిఐ ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ 1.8గిగా ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 630 ప్రొసెసర్, 4జిబి లేదా 6జిబి ర్యామ్ తో జతచేయబడింది. ఫోన్ ఇంటర్నల్ స్టోరేజి 64జిబి ఉంటుంది. మైక్రో ఎస్డి కార్డు ద్వారా 128జిబి వరకు విస్తరించుకునే అవకాశం ఉంటుంది.

ఇక కెమెరాలను చూస్తే అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. నోకియా 7 బ్యాక్ కెమెరా 16మెగాపిక్సెల్, ఫ్రైమరీ కెమెరా బ్యాక్ 5మెగాపిక్సెల్స్ , ఫ్రంట్ షూటర్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1నౌగట్ తో రన్ అవుతుంది. 3000ఎంహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ సపోర్టు ఉంటుంది.

వై-ఫై, GPS, బ్లూటూత్, NFC,3G,4G,వంటి కనెక్టివిటి ఆప్షన్స్ ఉన్నాయి. డ్యూయల్ సిమ్ (GSM మరియు GSM) ఆప్షన్ తో వస్తుంది. సెన్సార్ ఆన్ బోర్డ్ కంపాస్ మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్, యాక్సిలేరోమీటర్, పరిసరకాంతి సెన్సర్ మరియు గైరోస్కోప్ వంటివి ఉన్నాయి. ఇది 141.20 x 71.40 x 7.90 ఎత్తు, వెడల్పు, మందం తో వస్తుంది.

Read more about:
English summary
According to latest rumors coming out of China, it seems HMD Global is set to launch Nokia 7 globally in early 2018.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot