ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌లతో నోకియా 7 ప్లస్ , మోటరోలా వన్ విజన్

|

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోన్‌లలో ముఖ్యంగా మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో నోకియా 7ప్లస్ మరియు మోటోరోలా వన్ విజన్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి రెండు గత సంవత్సరం విడుదలయ్యాయి. ఇప్పుడు ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 10 యొక్క అప్‌డేట్‌ను స్వీకరించడం ప్రారంభించాయి.

ఆండ్రాయిడ్ 10
 

నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు తన ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను స్వీకరించడం ప్రారంభించింది అని నోకియా మొబైల్ బ్రాండ్ లైసెన్స్‌దారు హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ప్రకటించింది. ఇటీవలి కాలంలో కొత్త అప్‌డేట్‌ను పొందిన రెండవ స్మార్ట్‌ఫోన్‌గా నోకియా 7 ప్లస్ నిలిచింది. హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థ ఇంతకు మునుపే నోకియా 6.1 ప్లస్‌కు ఆండ్రాయిడ్ 10 సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

లెనోవా మొట్టమొదటి ఫోల్డబుల్ PC!!! ధర కొంచెం భారీగానే.....

నోకియా 7 ప్లస్‌

నోకియా 7 ప్లస్‌ను ఆండ్రాయిడ్ ఓరియోతో 2018 లో లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది ఆండ్రాయిడ్ పై అప్‌డేట్ అందుకుంది. నోకియా 7 ప్లస్ అనేది గూగుల్ యొక్క ఆండ్రాయిడ్ వన్ ప్రోగ్రామ్‌లో ఒక భాగం. ఇది సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఆప్టిమైజ్ చేసిన స్టాక్ ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్‌కు హామీ ఇస్తుంది. ఎప్పటిలాగే వినియోగదారులు OTA పద్ధతి ద్వారా దశలవారీగా ఈ అప్‌డేట్‌ను పొందుతారు. అలాగే మోటరోలా వన్ విజన్ కూడా దాని "వన్" సిరీస్‌ లైనప్ యాజమాన్యంలోని విడుదల చేసిన మొదటి బ్రాండ్ లలో ఇది ఒకటి. ఇప్పుడు ఇది కూడా ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను పొందడం ప్రారంభించింది.

RS.200 లోపు ఉత్తమ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న జియో,ఎయిర్‌టెల్, వొడాఫోన్

నోకియా 7 ప్లస్‌కు ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌
 

నోకియా 7 ప్లస్‌కు ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌

నోకియా మొబైల్ సంస్థ ఆండ్రాయిడ్ యొక్క సరికొత్త వెర్షన్‌ను నోకియా 7 ప్లస్‌కు విడుదల చేస్తోందని ట్వీట్ చేసింది. ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ 1.4GB స్టోరేజ్ V4.10C పరిమాణంలో మరియు దానితో పాటు డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా తీసుకువస్తుంది. ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ డార్క్ మోడ్, స్మార్ట్ రిప్లైతో పాటు సిగ్నల్ నావిగేషన్‌ ఫీచర్ లను కూడా తీసుకువస్తుంది. వినియోగదారులు దశల వారిగా అప్‌డేట్‌ యొక్క నోటిఫికేషన్‌ను స్వీకరిస్తారు. అలా కాదు అనుకుంటే అప్‌డేట్‌ను మాన్యువల్‌గా తనిఖీ చేయడానికి సెట్టింగులు> ఫోన్ అబౌట్> సిస్టమ్ అప్‌డేట్‌ వద్దకు వెళ్ళి తనిఖీ చేయవచ్చు.

ColorOS 7 ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్పష్టమైన ఆండ్రాయిడ్ స్కిన్...

మోటరోలా వన్ విజన్ ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌

మోటరోలా వన్ విజన్ ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌

మోటరోలా వన్ విజన్ కూడా ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను స్వీకరించడం ప్రారంభించింది. ఈ క్రొత్త అప్‌డేట్‌ యొక్క బిల్డ్ నెంబర్ QSA30.62-24. నవీకరణకు సంబంధించి ఫోన్ లో చాలా క్రొత్త ఫీచర్లు మరియు మెరుగుదలలు ఉన్నాయి. వీటిలో కొన్ని సిస్టమ్-వైడ్ డార్క్ మోడ్, కొత్త సిగ్నల్ నావిగేషన్ సిస్టమ్, ఫోకస్ మోడ్, లైవ్ క్యాప్షన్ సపోర్ట్ వంటివి మరెన్నో ఉన్నాయి.

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్

ప్రతి ఇతర అప్‌డేట్ మాదిరిగానే మోటరోలా వన్ విజన్‌కు కూడా ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్ దశలవారీగా జరుగుతుందని గమనించాలి. ఒకవేళ మీరు మీ ఫోన్లో అప్‌డేట్‌ల కోసం తనిఖీ చేయాలనుకుంటే మీరు సెట్టింగ్స్> సిస్టమ్‌ అబౌట్ > సిస్టమ్ అప్‌డేట్‌ల విభాగం క్రింద దీనిని తనిఖీ చేయవచ్చు. మోటరోలా వన్ విజన్ ఆండ్రాయిడ్ 9 పైతో 2019 మేలో ప్రారంభించబడింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Nokia 7 Plus and Motorola One Vision Smartphones Start Receiving Android 10 Updates

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X