హైలెట్ కెమెరా ఫీచర్‌తో నోకియా 7 ప్లస్, కమింగ్ సూన్..

Written By:

మొబైల్ దిగ్గజం నోకియా మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌‌తో మార్కెట్లోకి దూసుకురాబోతోంది. ఆండ్రాయిడ్‌ ఫ్యామిలీలోని కొత్త స్మార్ట్‌ఫోన్‌ను బార్సీలోనాలో జరగనున్న మొబైల్‌ వరల్డ్‌కాంగ్రెస్‌ 2018లో హెచ్‌ఎండీ గ్లోబల్‌ పరిచయం చేయనుందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా నోకియా9, నోకియా 1తో పాటు నోకియా 7 ప్లస్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానుందన్నఅంచనాలు భారీగా నెలకొన్నాయి. కాగా నోకియా నుంచి రానున్న ఈ ఫోన్ బెజెల్‌ లెస్‌ డిస్‌ప్లేతో పాటు, కెమెరాపరంగా కూడా కార్ల్‌ జీస్‌ లెన్సెస్‌ను అమర్చినట్టు తెలుస్తోంది.

స్పామ్ కాల్స్‌ విసిగిస్తున్నాయా, Do Not Disturbతో తరిమేయండి, సింపుల్ ట్రిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 7 ప్లస్‌ ఫీచర్లు ( అంచనా )

6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్ ప్లే
విత్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌,
2160 x 1080 పిక్సెల్‌ రిజల్యూషన్‌
క్వాల్కం స్నాప్‌ డ్రాగెన్ 600 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్‌ ఓరియో 8.0
4జీబీర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
12-13 ఎంపీ డబుల్‌ రియర్‌ కెమెరా
16ఎంపీ సెల్పీ కెమెరా విత్‌ టెట్రాసెల్‌ టెక్నాలజీ

మొబైల్ వరల్డ్‌ కాంగ్రెస్‌ (2018)లో..

కాగా ఫిబ్రవరి 25l జరగనున్న మొబైల్ వరల్డ్‌ కాంగ్రెస్‌ (2018)లో నోకియా1, నోకియా 8 (2018) నోకియా 9 స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేస్తున్నట్టు ఇప్పటికే హెచ్‌ఎండీ గ్లోబల్‌ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లోనే నోకియా 7 ప్లస్ లాంచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నోకియా పవర్ యూజర్ బైదు రిపోర్ట్ చేసింది.

12MP and 13MP కెమెరా

కాగా నోకియా నుంచి రానున్న ఈ ఫోన్లు ZEISS లెన్స్ తో రానున్నట్లు తెలుస్తోంది. 12MP and 13MP కెమెరాతో రానున్న ఈఫోన్లో ప్రధాన ఆకర్షణ కెమెరా ఫీచర్ అని కధనాలు వస్తున్నాయి. 

16 ఎంపీ సెల్ఫీ కెమెరా

కాగా 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను ఇందులో పొందుపరిచరినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బ్యాక్ అండ్ సెల్పీ కెమెరాలు ఒకేసారి పనిచేసే విధంగా రానుందని సమాచారం. మొబైల్‌ వరల్డ్‌కాంగ్రెస్‌ 2018లో తెలిసే అవకాశాలు ఉన్నాయి.

4జిబి ర్యామ్ 64GB internal storage

బెంచ్ మార్క్ లో లీకయిన వివరాల ప్రకారం నోకియా 7 ప్లస్ Snapdragon 660 SoCతో రానుంది. అలాగే 4జిబి ర్యామ్ 64GB internal storageతో మొబైల్ రానున్నట్లు సమాచారం. అయితే ఈ ఫొన్ ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మరిన్ని వివరాలు మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018లో తెలిసే అవకాశం ఉంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 7 Plus to arrive with 18:9 display, dual cameras and more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot