Home
Mobile

అమ్మకానికి వచ్చిన నోకియా కొత్త స్మార్ట్‌ఫోన్లు, పలు క్యాష్‌‌బ్యాక్‌ ఆఫర్లు

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ ఇటీవల లాంచ్‌ చేసిన నోకియా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు భారత మార్కెట్లో ప్రారంభమయ్యాయి.

By Hazarath Aiah

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ ఇటీవల లాంచ్‌ చేసిన నోకియా స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు భారత మార్కెట్లో ప్రారంభమయ్యాయి. నోకియా 6(2018),నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్లు అమెజాన్‌ ద్వారా అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయి. నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్/కాప్, వైట్/కాపర్ కలర్‌ కాంబినేషన్లలో లభిస్తోంది. దీని ధర రూ. రూ.25,999. ప్రీమియం సెగ్మెంట్‌లో నోకియా 8 సిరోకో స్మార్ట్‌ఫోన్ బ్లాక్ కలర్‌లో రూ.49,999 ధరకు అందుబాటులోఉంది. దీంతోపాటు ఆఫ్‌లైన్‌లో పలు రిటెయిల్ స్టోర్స్‌లోనూ విక్రయానికి లభ్యం కానున్నాయి.

Nokia 7 Plus, Nokia 8 Sirocco

నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో ఫోన్లపై వినియోగదారులకు పలు ఆఫర్లు లభిస్తున్నాయి. నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో కొనుగోలుపై ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ , క్రెడిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం కాష్‌ బ్యాక్‌ ఆఫర్‌, అమెజాన్ నుంచి నోకియా 7 ప్లస్ కొనుగోలు చేసిన వారికి 2000 రూపాయల ఎయిర్‌టెల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ కూడా ఉంది. 36 నెలల వ్యవధిలో నిర్ణీత రీచార్జ్‌ల అనంతరం ఈ మొత్తాన్ని ఎయిర్‌టెల్‌ పే పేమెంట్‌బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది.

అలాగే నోకియా 8 సిరోకోపై ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.199, రూ.349 రీచార్జిలపై, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు రూ.399, రూ.499 ప్లాన్లపై అదనంగా 6 నెలల పాటు 20 జీబీ డేటాను నెల వారీగా అందిస్తున్నారు. అలాగే ఎయిర్‌టెల్ టీవీ యాప్‌కు డిసెంబర్ 31, 2018 వరకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నారు. దీంతోపాటు ఆకర్షణీయమైన ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌, అలాగే నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తోంది.

నోకియా 7 ప్లస్ ఫీచర్లు
6 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

నోకియా 8 సిరోకో ఫీచర్లు
5.5 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, యూఎస్‌బీ టైప్ సి, 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Nokia 7 Plus, Nokia 8 Sirocco Now Available in India: Price, Specifications more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X