నోకియా 8లో సగం ధరకే, నోకియా 7 వచ్చేసింది !
HMD గ్లోబల్ తొలిసారి చైనాలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 7ను లాంచ్ చేసింది.
HMD గ్లోబల్ తొలిసారి చైనాలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 7ను లాంచ్ చేసింది. ఇతర ఫోన్లకు ధీటుగా వచ్చిన ఈ ఫోన్ అక్కడి మార్కెట్ ని హస్తగతం చేసుకునే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అదీగాక ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లాంటి ఫీచర్లతో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ నోకియా8 కన్నా తక్కువ ధరకే లభిస్తోంది. మరి ఫీచర్లపై ఓ లుక్కేయండి.

నోకియా 7 ఫీచర్లు
5.2 ఇంచ్ ఐపీఎస్ 2.5డీ డిస్‌ప్లే
స్క్రీన్ రిజల్యూషన్ 1080x1920 పిక్సెల్స్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3
ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్
4 జీబీ, 6 జీబీ ర్యామ్ వేరియంట్స్, 128 జీబీ వరకు ఎక్స్‌ప్యాండబుట్ స్టోరేజి
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
నోకియా 7 ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
ఓరియో అప్‌డేట్‌కు రెడీ
యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, ఎన్‌ఎఫ్‌సీ కనెక్టివిటీ
ఫింగర్ ప్రింట్ స్కానర్
3000 ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

3డీ గ్లాస్ థెర్మోఫార్మింగ్ టెక్నాలజీ
ఈ హ్యాండ్‌సెట్ వెనుకవైపు 3డీ గ్లాస్ థెర్మోఫార్మింగ్ టెక్నాలజీని వాడారు. 360 డిగ్రీ రికార్డింగ్‌ను సపోర్ట్ చేసే నోకియా ఓజో ఆడియా టెక్నాలజీ నోకియా 7లో ఉంది.

డ్యుయల్ సైట్ మోడ్‌తో ఫేస్‌బుక్ లైవ్‌లోకి..
కెమెరా యాప్ నుంచే నేరుగా డ్యుయల్ సైట్ మోడ్‌తో ఫేస్‌బుక్ లైవ్‌లోకి వెళ్లే ఆప్షన్ ఇందులో ఉన్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్ తెలిపింది. అంతేకాదు బిల్టిన్ కెమెరా నుంచే యూజర్లు ఫేస్‌బుక్, యూట్యూబ్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ ఇచ్చుకోవచ్చు.

కెమెరా విషయానికొస్తే ..
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా , సెల్ఫీ అభిమానుల కోసం 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. నోకియా 8లో తొలిసారి వాడిన డ్యుయల్ సైట్ మోడ్ ఫీచర్‌ను ఇందులోనూ ఇచ్చారు. అంటే యూజర్లు ఒకేసారి రియర్, ఫ్రంట్ కెమెరాలను వాడుకోవచ్చు.

చైనాలోనే అందుబాటులో..
ప్రస్తుతానికి నోకియా 7 చైనాలోనే అందుబాటులో ఉంది. వచ్చే వారం నుంచి ఈ మోడల్ అక్కడి మార్కెట్‌లోకి రానుంది. మిగతా దేశాల్లోకి ఎప్పుడు అడుగుపెడుతుందన్నది మాత్రం ఇంకా చెప్పలేదు.

4 జీబీ, 6 జీబీ ర్యామ్ వేరియంట్స్
4 జీబీ, 6 జీబీ ర్యామ్ వేరియంట్స్, 128 జీబీ వరకు ఎక్స్‌ప్యాండబుట్ స్టోరేజి లో ఈ ఫోన్లు దూసుకొచ్చాయి. ఈ ఫోన్ ధరలు కూడా బడ్జెట్లోనే ఉన్నాయి. 4 జీబీ వేరియంట్ మన కరెన్సీలో సుమారు రూ.25 వేలు కాగా.. 6 జీబీ వేరియంట్ రూ.26, 500గా ఉంది.

ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
నోకియా 7 ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ వర్షన్‌తో వస్తున్నది. ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఉంటాయని కూడా కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఓరియో అప్‌డేట్‌కు నోకియా 7 సిద్ధంగా ఉందని హెచ్‌ఎండీ గ్లోబల్ వెల్లడించింది.


Click it and Unblock the Notifications








