ఎగిరేందుకు సిద్దమైన నోకియా జంట పక్షులు..

Posted By: Staff

ఎగిరేందుకు సిద్దమైన నోకియా జంట పక్షులు..

నోకియా మొబైల్ మార్కెట్లోకి కొత్తగా రెండు సింబియన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్‌ని విడుదల చేసింది. దీనిని బట్టి చూస్తుంటే ఇండియన్ మార్కెట్లో ఈ సీజన్లో నోకియా తక్కవ ధర కలిగిన లగ్జరీ మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేసింది. త్వరలోనే ఇండియాలో అడుగు పెట్టనున్న ఆరెండు సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్ నోకియా 700, నోకియా 701. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ తయారీదారులు కస్టమర్స్ యొక్క అభిరుచులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే మొబైల్స్‌ని విడుదల చేయడం జరుగుతుంది. నోకియా 700 చూడడానికి చాలా అందంగా సిల్వర్, వైట్ కలర్స్ మిశ్రమంతో ఉందని తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా వేరే కలర్స్‌లో కూడా నోకియా 700 మార్కెట్లో లభ్యం కానుంది.

ఇక నోకియా 701 విషయానికి వస్తే గతంలో విడుదలైన నోకియా సి7 మొబైల్‌కి దగ్గరగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నోకియా సి7కి ఇది అప్ గ్రేడేడ్ వర్సన్‌గా భావించవచ్చు. ఈ రెండు మొబైల్స్ ఫీచర్స్ ఒక్కసారి గమనించినట్లైతే నోకియా 700 మొబైల్ 3.2 ఇంచ్ క్లియర్ బ్లాక్ AMOLED nHD స్క్రీన్‌ని కలిగి ఉండడం వల్ల యూజర్స్‌కు చక్కని వీడియో ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. నోకియా 700తో పోల్చితే నోకియా 701 మొబైల్ యొక్క స్క్రీన్ సైజు కొంచెం పెద్దదిగా ఉంటుంది. అంటే 3.5 ఇంచ్ స్కీన్ సైజుని కలిగి ఉంది.

రెండు మొబైల్స్‌లలో గమనించినట్లేతే మరో తేడా కెమెరా. నోకియా 700 మొబైల్‌లో 5 మెగా ఫిక్సల్ కెమెరాని పోందుపరచగా, అదే నోకియా 701లో 8 మెగా ఫిక్సల్ కెమెరాని పోందుపరచడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా కెమెరాలో ఫిక్సడ్ ఫోకస్ స్నాపర్, డ్యూయల్ ఎల్‌ఈడి ఫీచర్స్‌ ప్రత్యేకం. వీడియో కాలింగ్ ఫీచర్ కోసం నోకియా 701 మొబైల్ ముందు భాగంలో విజిఎ కెమెర్ అమర్చడం జరిగింది. నోకియా 701 మొబైల్‌తో ఇంటర్నల్‌గా 512 ఎమ్‌బి మొమొరీ లభించగా మొమొరీని ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది.

ఎంటర్టెన్మెంట్ విషయంలో యూజర్స్‌ను నిరాశకు గురిచేయవు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ లాంటి వాటిని ఈజీగా కనెక్టు అయ్యేందుకు ఇందులో ప్రత్యేకంగా బటన్స్ రూపోందించడం జరిగింది. ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీకి వస్తే బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తాయి. నోకియా అంటే బ్యాటరీ బ్యాక్ అప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్ని అత్యాధునిక ఫీచర్స్ ఉన్న నోకియా 700 మొబైల్ ధర సుమారుగా రూ 18,000, అదే నోకియా 701 మొబైల్ ధర సుమారుగా రూ 20,000 వరకు ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot