నోకియా కొత్త ఫోన్ నోకియా 700(జీటా)

Posted By: Super

నోకియా కొత్త ఫోన్ నోకియా 700(జీటా)

ఇండియాలో శ్యామ్‌సంగ్, మోటరోలా, సోని ఎరిక్సన్, మైక్రోమ్యాక్స్ లాంటి అత్యుత్తమమైన కంపెనీల పోటీని తట్టుకోని కూడా మంచి కస్టమర్ రిలేషన్ షిప్‌ని, మంచి మార్కెట్ షేర్‌ని సంపాదించుకున్న మొబైల్ కంపెనీలలో నోకియా ఒకటి. రాబోయే కాలంలో మార్కెట్లోకి నోకియా సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్‌ని విడుదల చేయనుంది. దానిపేరే నోకియా 700(నోకియా జీటా). ఇక నుండి నోకియా కంపెనీ నుండి సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్ రావని మిగతా కంపెనీలు అనుకుంటున్న సమయంలో నోకియా ఈ జీటాని విడుదల చేసి ఆశ్చర్యంలో ముంచింది. దానికి కారణం ఇటీవలే నోకియా మైక్రోసాప్ట్‌తో ఒప్పందం కుదుర్చుకోని నోకియా విండోస్ మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయనుంది.

నోకియా 700కి ఉన్న మరోపేరు నోకియా జీటా. ఇప్పటి వరకు నోకియా విడుదల చేసినటువంటి తక్కువ మందం ఉన్నమొబైల్స్‌లో నోకియా జీటా ఒకటి. ఇక దీని చుట్టుకొలతలు గనుక చూసుకున్నట్లైతే 110x51x10mm ఉండగా దీని బరువు 80g ఉన్నాయి. క్యాండీ బార్ మొబైల్ అయినటువంటి నోకియా 700 సింబియన్‌కి అప్ గ్రేట్ వర్సన్ అయిన సింబియన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ మొబైల్‌లో మల్టీ టాస్కింగ్ చాలా స్పీడ్‌గా జరిగేందుకుగాను ఇందులో 1 GHz ప్రాసెసర్ ఉంది. సింబియన్ అన్నా ఆపరేటింగ్ సిస్టమ్‌ తర్వాత వచ్చిన లెటేస్ట్ వర్సన్ సింబియన్ బెల్లీ. సింబియన్ బెల్లీ రాకతో గతంలో టెక్ట్ బటన్స్ ఉన్న ప్లేసులో ఇప్పుడు గ్రాఫికల్ ఐకాన్స్ వచ్చాయి.

ఇందులో ఉన్న మరో కొత్త ఆప్షన్ ఏమిటంటే స్క్రీన్ పైభాగంలో డ్రాప్ డౌన్ మెను నోటిఫికేషన్స్ ఉండడం. నోకియా 700లో 5మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఎల్‌ఈడి ఫ్లాష్‌ని కూడా కలిగి ఉంది. దీనికి ముందు భాగాన ఉన్నటువంటి కెమెరా సహాయంతో మీరు వీడియో కాల్స్‌ని పోందవచ్చు. ప్రస్తుతం ఇండియాలో 3జి టెక్నాలజీ అందుబాటులో ఉండడంతో ఈ మొబైల్ 3జి టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది. సాధారణంగా కొత్త మొబైల్ వాడే వారికి ఇదోక కొత్త అనుభవం. ఇక ప్రస్తుతం మొబైల్ మార్కెట్లో ఉన్న లెటేస్ట్ కనెక్టివిటీ టెక్నాలజీలు బ్లూటూత్, వై-పై లాంటి అన్నింటిని సపోర్ట్ చేస్తుంది. మైక్సో ఎస్‌డి కార్డ్ ద్వారా ఇందులో 32జిబి వరకు మొమొరీని స్ట్రోర్ చేసుకోవచ్చు.

Summarizing the key features of Nokia 700:

Symbian Belle operating system.
Equipped with a process of 1GHz for better multitasking
A 5 MP camera with LED flash. The 360*640 resolution gives life to the pictures.
On the connectivity front, we have wifi and Bluetooth.
32GB expandable memory, for never ending entertainment.
An ultra thin phone.

నోకియా 700లో ఉన్నటువంటి స్టీరియో ఫోనిక్ మైక్రోపోన్స్ వల్ల చక్కని సంగీతాన్ని పోందగలుగుతారు. ఆండ్రాయిడ్ ఫోన్స్‌తో గనుక దీనిని పోల్చినట్లైతే ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇంటర్నెట్‌లో విడుదలైనటువంటి విజువల్స్ గనుక చూస్తుంటే ఈ మొబైల్ మార్కెట్లో‌కి విడుదలైతే నోకియాకి తిరిగి పూర్వవైభవం వస్తుందని భావిస్తున్నారు. అంతేకాకుండా మిగతా కంపెనీలకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌కి కూడా కాంపిటేషన్‌గా కూడా నిలుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లోకి విడుదల కాని దీని ఖరీదు ఇంకా నిర్ణయించలేదు. దానికి సంబంధించిన మిగతా విషయాలు త్వరలోనే మీముందు ఉంచడం జరగుతుంది. అప్పటి వరకు టచ్‌లో ఉండండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot