డిసెంబర్ 10న ఇండియా మార్కెట్లో లాంచ్ కానున్న నోకియా 8.1

మొబైల్ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 8.1ను నిన్న దుబాయ్ లో లాంచ్ చేసింది.నోకియా 8 మార్కెట్లో విజయవంతమైన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా నోకియా 8.1ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

|

మొబైల్ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 8.1ను నిన్న దుబాయ్ లో లాంచ్ చేసింది.నోకియా 8 మార్కెట్లో విజయవంతమైన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా నోకియా 8.1ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.కాగా ఈ నోకియా 8.1 ఫోన్ ను డిసెంబర్ 10న ఇండియా లో లాంచ్ చేస్తునట్టు హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా పొందడం ఎలా ?నెట్‌ఫ్లిక్స్,అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఉచితంగా పొందడం ఎలా ?

ఫీచర్లు...

ఫీచర్లు...

6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2246 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

ధర...

ధర...

బ్లూ/సిల్వర్, స్టీల్/కాపర్, ఐరన్/స్టీల్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ విడుదల కాగా రూ.31,900 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

ఆండ్రాయిడ్ 9.0 పై...

ఆండ్రాయిడ్ 9.0 పై...

ఇందులో 6.18 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో అమర్చారు. ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఇందులో అందిస్తున్నారు.

12, 13 మెగాపిక్సల్ కెమెరాలు...

12, 13 మెగాపిక్సల్ కెమెరాలు...

ఈ ఫోన్ వెనుక భాగంలో 12, 13 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉండగా, ముందు భాగంలో 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అదే విధంగా ఈ ఫోన్లో 3500 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న భారీ బ్యాట‌రీని ఏర్పాటు చేశారు.

గతంలో వచ్చిన నోకియా 8 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

గతంలో వచ్చిన నోకియా 8 ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...

5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3090 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0

 

 

Best Mobiles in India

English summary
Nokia 8.1 launched as new 'value flagship' from HMD Global: Why it could be the perfect ‘flagship killer’.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X