నోకియా 8.1 విడుదలపై క్లారిటీ ఇచ్చిన హెచ్‌ఎండీ గ్లోబల్

మొబైల్ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 8.1ను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనుంది.

|

మొబైల్ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన స్మార్ట్‌ఫోన్ నోకియా 8.1ను ఈ నెల 28వ తేదీన విడుదల చేయనుంది. నోకియా 8 మార్కెట్లో విజయవంతమైన నేపథ్యంలో దానికి కొనసాగింపుగా నోకియా 8.1ను మార్కెట్లోకి తీసుకువస్తోంది. అయితే ఈ ఫోన్ నోకియా 7ఎక్స్ కి రీ బ్రాండెడ్ వర్షన్ గా వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అవి వట్టి పుకార్లేనని తెలుస్తోంది. కాగా నోకియా 7ఎక్స్ napdragon 710 SoCతో ఈ మధ్య చైనాలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కాగా రూ.23,999 ధరకు ఈ ఫోన్ లభ్యం కానున్నట్లు తెలిసింది.

 

ఇక ఒకే స్క్రీన్ పై రెండు యాప్‌లను రన్ చేసుకోవచ్చుఇక ఒకే స్క్రీన్ పై రెండు యాప్‌లను రన్ చేసుకోవచ్చు

నోకియా 8.1ను ఈ నెల 28న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది...

నోకియా 8.1ను ఈ నెల 28న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది...

91Mobiles రిపోర్ట్ ప్రకారం నోకియా 8.1ను ఇండియాలో ఈ నెల 28న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.23,999గా ఉండనుందని సమాచారం. కాగా Nokia 7 Plus ధర కూడా ఇంచుమించు ఈ స్థాయిలోనే ఉన్న సంగతి తెలిసిందే.

 

 

ఈ ఫోన్ లాంచింగ్ మీద మీడియాకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది...

ఈ ఫోన్ లాంచింగ్ మీద మీడియాకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది...

కంపెనీ ఈ ఫోన్ లాంచింగ్ మీద మీడియాకు ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. కాగా ఇందులో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు.నోకియా 8.1 స్మార్ట్‌ఫోన్‌లో 6.18 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇక కెమెరా విషయానికి వస్తే...
 

ఇక కెమెరా విషయానికి వస్తే...

ఇక కెమెరా విషయానికి వస్తే 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్ తో పాటు మరికొన్ని అదనపు ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా నోకియా 8, నోకియా 7 ప్లస్ ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి....

కాగా నోకియా 8, నోకియా 7 ప్లస్ ఫీచర్లు ఈ కింది విధంగా ఉన్నాయి....

నోకియా 8 ఫీచ‌ర్లు

5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3090 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0

 

 

నోకియా 7 ప్లస్ ఫీచర్లు

నోకియా 7 ప్లస్ ఫీచర్లు

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Best Mobiles in India

English summary
Nokia 8.1 might launch in India on the 28th of November: Expected to cost Rs 23,999 more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X