నోకియా లేటెస్ట్ అప్‌డేట్, మరో దిమ్మతిరిగే ఫోన్ వస్తోంది

నోకియా లాంచ్ చేసిన నోకియా 3, నోకియా 5, నోకియా 6, నోకియా 3310 (2017 వర్షన్) ఫోన్‌లు జూన్ నాటికి భారత్‌లో అందుబాటులో ఉంటాయని భావిస్తోన్న నేపథ్యంలో మరో ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

Read More : ATM దొంగతనాలు ఎలా జరుగుతున్నాయంటే.?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సర్‌ప్రైజ్ ప్యాకేజీ క్రింద..

India Today కథనం ప్రకారం.. నోకియా ఈ ఫోన్‌లతో పాటు నోకియా 8 మోడల్‌ను కూడా రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తోంది. సర్‌ప్రైజ్ ప్యాకేజీ క్రింద ఈ ఫోన్ అందుబాటులో ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

నోకియా 8 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

5.7 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్ ప్లే,
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,
గూగుల్ డే డ్రీమ్ వీఆర్ ప్లాట్‌ఫామ్ సపోర్ట్,

నోకియా 8 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

22 మెగా పిక్సల్ OIS + EIS రేర్ కెమెరా,
12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా,
6జీబి ర్యామ్,
స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి),
మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం,
కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, యూఎస్బీ ఆన్ ద గో, 4జీ),
సెన్సార్స్ (ప్రాక్సిమిటీ, యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరో స్కోప్)

ధర సుమారుగా...

మార్కెట్లో నోకియా 8 ధర సుమారుగా రూ.37,200 నుంచి రూ.41,873 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. నోకియా 8 విడుదలకు సంబంధించి హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ ఇప్పటి వరకు ఏవిధమైన అఫీషియన్ అనౌన్స్‌మెంట్ చేయలేదు. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రకటన ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

నోకియా 9 మోడల్‌

నోకియా 3, నోకియా 5, నోకియా 6 మోడల్స్‌తో పాటు మరో నాలుగు స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఈ ఏడాదిలోనే నోకియా మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు హెచ్‌ఎండి గ్లోబల్ ప్రకటించింది. వీటిలో ఒకటైన నోకియా 9 మోడల్‌కు సంబంధించి ఆసక్తికర సమచారం ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8, ఎల్‌జీ జీ6, హెచ్‌టీసీ యూ అల్ట్రా వంటి ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లకు పోటీగా భావిస్తోన్న నోకియా 9 కూడా త్వరలోనే మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 8 to be launched in June along with other Nokia smartphones. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot