Home
Mobile

దడపుట్టిస్తున్న నోకియా 8 బోథీ ఫీచర్‌, అసలేంటి ఇది..?

ఆ ఒక్క ఫీచర్‌తో నోకియా ఆపిల్, శాంసంగ్‌లను ఢీ కొట్టబోతోంది. ఆ ఫీచర్లో అంతగా ఏముందనుకుంటున్నారా..

By Hazarath

ఇప్పటి వరకు మనం స్మార్ట్‌ఫోన్‌లలో వెనుక కెమెరాతో తీసే ఫొటోలు, ముందు కెమెరాతో తీసుకునే సెల్ఫీలను చూశాం. మరి ఒకేసారి సెల్ఫీ, వెనుక కెమెరాలతో ఫోటో దిగితే ఎలా ఉంటుంది. అలాంటి అద్భుతమైన ఫీచర్‌తో నోకియా 8 దూసుకొచ్చింది. ఒకే సమయంలో డ్యుయల్‌ మోడ్‌ సైట్‌ ద్వారా ముందు, వెనుక కెమెరాలను వాడుకునే విధంగా బోథీ ఫీచర్ ను తీసుకొచ్చింది. ఆ ఫోన్‌లో ఉన్న డిఫాల్ట్‌ కెమెరా యాప్‌లో ఈ ఫీచర్‌ను అందిస్తున్నారు.

తొలి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌

తొలి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌

ఒకేసారి రెండు కెమెరాలతో ఫోటోలు తీసుకునే విధంగా నోకియా8 మార్కెట్లోకి దూసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఏకకాలంలో సెల్ఫీ, బ్యాక్ కెమెరా నుంచి ఫోటోలు తీసుకోవచ్చు. డ్యూయెల్‌ సైట్‌ మోడ్‌ ఫీచర్‌తో వస్తోన్న తొలి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌ ఇదే. జీస్‌ ఆప్టిక్స్‌ కెమెరాలతో 4కే వీడియోలను తీసుకోవచ్చు.

image source :bgr

ఆండ్రాయిడ్‌ 7.1.1 ఓఎస్‌

ఆండ్రాయిడ్‌ 7.1.1 ఓఎస్‌

భారత మార్కెట్లోకి వచ్చిన నోకియా 8 అమెజాన్లో అమ్మకాలకు రెడీ అయింది. .ఆండ్రాయిడ్‌ 7.1.1 ఓఎస్‌తో పనిచేసే ఈ ఫోన్‌ పాలిష్డ్‌ బ్లూ, టెంపెర్డ్‌ బ్లూ, స్టీల్‌ అండ్‌ పాలిష్డ్‌ బ్లూ వేరియంట్లలో లభిస్తోంది. ఆండ్రాయిడ్ ఓకి అప్ డేట్ కావచ్చు.

image source: the verge

ధర

ధర

ధర విషయానికి వస్తే కంపెనీ ఇండియాలో దీని ధరను రూ.36,999గా నిర్ణయించింది.

నోకియా 8 ఫీచ‌ర్లు...

నోకియా 8 ఫీచ‌ర్లు...

5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3090 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0

పూర్తిగా అల్యూమినియంతో..

పూర్తిగా అల్యూమినియంతో..

నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిగా అల్యూమినియంతో రూపొందించారు. అనంతరం దానిపై లగ్జరీ మిర్రర్ ఫినిష్ ఇచ్చారు. దీంతో ఫోన్‌కు ప్రీమియం లుక్ వస్తుంది.

3 మైక్రోఫోన్లను..

3 మైక్రోఫోన్లను..

ఈ ఫోన్‌లో 3 మైక్రోఫోన్లను ఏర్పాటు చేశారు. దీని వల్ల నాణ్యమైన ఆడియో వినడమే కాదు, ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే శబ్దాలు తగ్గుతాయి. దీంతో నాణ్యమైన కాల్ క్వాలిటీ లభిస్తుంది.

కెమెరా యాప్‌తో నేరుగా..

కెమెరా యాప్‌తో నేరుగా..

ఇక ఈ ఫోన్‌లో ఉన్న కెమెరా యాప్‌తో నేరుగా ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా నోకియా 8 కెమెరా యాప్‌ను తీర్చిదిద్దారు.

Best Mobiles in India

English summary
Nokia 8 hopes to beat Apple and Samsung with 'bothie', a new version of the selfie more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X