జూలై 31న నోకియా 8 లాంచ్

నోకియా తరువాతి మోడల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ నోకియా 8 జూలై 31న లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. మార్కెట్లో ఈ ఫోన్ రూ.44,000 వరకు ఉండొచ్చని GSMArena పేర్కొంది. గీక్‌బెంచ్ డేటాబేస్ ద్వారా లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్ మోడల్ నెంబర్ TA-1004గా ఉండొచ్చు. నోకియా 8 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చని రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

జూలై 31న నోకియా 8 లాంచ్

5.7 అంగుళాల 2కే డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 2.45గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ డ్యుయల్ ఎల్ఈడి ఫ్లాష్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచాన్ని శాసించిన ఘనత...

1990 నుంచి 2000 సంవత్సరాల మధ్య నోకియా ఫోన్‌లు ప్రపంచాన్ని శాసించగలిగాయి. మొబైల్ ఫోన్ యూజర్లకు, ఆ రోజుల్లో నోకియా అంతలా కనెక్ట్ అవ్వాటానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎక్కువ సేపు ఉపయోగించుకునే విధంగా సమర్థవంతమైన బ్యాటరీ బ్యాకప్, ఆపరేట్ చేసేందుకు సులువైన యూజర్ ఇంటర్‌ఫేస్, అమోదయోగ్యమైన ధర వంటి అంశాలు నోకియా బ్రాండ్ వాల్యూను ఒక్కసారిగా పెంచేసాయి.

నోకియా తన ప్రయత్నాలను మానకోలేదు..

మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా మద్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకోని రూపోందించడంతో నోకియా మొబైల్ మార్కెట్ శరవేగంగా విస్తరించగలిగింది. అందుకే, ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియాకు ప్రత్యేక స్థానం ఉంది. మొబైల్ ఫోన్‌ల తయారీ విభాగంలో ఒకప్పుడు ప్రపంచాన్నే శాసించిన నోకియాకు కాలక్రమంలో అనేక ఒడిదుడుకులే ఎదుర్యయ్యాయి. అయినప్పటికి, నోకియా తన ప్రయత్నాలను మానకోలేదు. ప్రపంచవ్యాప్తంగా చరిత్ర సృష్టించిన పలు నోకియా ఫోన్‌లకు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం..

నోకియా 3310...

2000 సంవత్సరంలో నోకియా నుంచి విడుదలైన 3310 మోడల్ ఫోన్ ప్రపంచవ్యాప్తంగా 126 మిలియన్ యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. 5 -లైన్ మోనో క్రోమ్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ ఫోన్‌లో సింప్లిస్టిక్ యూజర్ ఇంటర్‌‌ఫేస్ ఆకట్టుకుంటుంది. క్యాలుక్యులేటర్, స్టాప్ వాచర్, రిమైండర్, Snake II వంటి సుప్రసిద్ధ గేమ్స్ ఈ ఫోన్‌లో ఉన్నాయి. ఈ ఫోన్లో మీరే సొంతంగా రింగ్ టోన్ కంపోజ్ చేసుకోవచ్చు.

నోకియా 1100

2003 సంవత్సరంలో నోకియా నుంచి విడుదలైన నోకియా 1100 ఫోన్ ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్ యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. డస్ట్ ఇంకా స్ప్లాష్ రెసిస్టెంట్ బాడీతో వచ్చిన,ఈ ఫోన్‌కు ఫ్లాష్‌లైట్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. భారత్‌లో ఈ ఫోన్‌ను టార్చ్ ఫోన్‌గా కూడా పిలుస్తారు. 4-లైన్ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్‌లో BL-5C 850mAh బ్యాటరీని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ బ్యాటరీ 400 గంటల స్టాండ్‌బై యూసేజ్‌ను అందించగలదు.

నోకియా 6600

2003లో నోకియా నుంచి విడుదలైన మరో మోడల్ ఫోన్ నోకియా 6600, ప్రపంచవ్యాప్తంగా 150 మిలియన్ యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. నోకియా సింబియాన్ OS 7.0 (Series 60) ప్లాట్‌ఫామ్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్‌లో 104 MHz ARM 9 ప్రాసెసర్తో పాటు 6 ఎంబి ఇంటర్నల్ స్టోరేజ్‌ను పొందుపరిచారు. పోన్ వెనుక భాగంలో 0.3 మెగా పిక్సల్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది.

నోకియా 5200, 5300

 మ్యూజిక్ ప్రియులను దృష్టిలో ఉంచుకుని నోకియా లాంచ్ చేసిన 5200, 5300 ఫ్లిప్ మోడల్ ఫోన్‌లు ప్రపంచవ్యాప్తంగా 30 మిలియన్ యూనిట్ల వరకు అమ్ముడైనట్లు సమాచారం. ఎఫ్ఎమ్ రేడియో అలానే ఎంపీ3 ప్లే బ్యాక్ సపోర్ట్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్‌లలో 2జీబి వరకు మైక్రోఎస్డీ కార్డ్ సదుపాయాన్ని కల్పించారు. నోకియా సిరీస్ 40 ఇంటర్‌ఫేస్‌తో వచ్చిన ఈ ఫోన్‌లు అప్పటో ఓ సంచలనం.

నోకియా ఇ71

నోకియా ఇ71 బ్లాక్‌బెర్రీకి పోటీగా నోకియా లాంచ్ చేసిన మొట్లమొదటి క్వర్టీ కీప్యాడ్ ఫోన్ నోకియా ఇ71. సింబియన్ 9.2 ఆపరేటింగ్ సిస్టంతో వచ్చిన ఈ ఫోన్‌లో 369MHz ఆర్మ్ ప్రాసెసర్తో పాటు 128ఎంబి ర్యామ్‌ను ఏర్పాటు చేసారు. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 8జీబి వరకు పొడిగించుకునే అవకాశాన్ని కల్పించారు. 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వచ్చిన ఈ ఫోన్ రోజు మొత్తానికి బ్యాటరీ బ్యాకప్‌ను ఆఫర్ చేయగలదు. 2జీ ఇంటర్నెట్ ను సపోర్ట్ చేయగలిగే ఈ ఫోన్ ద్వారా మెయిల్స్ కూడా పంపుకునే అవకాశాన్ని కల్పించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 8 launch could be pegged for July 31; to be priced at Rs.44,000. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot