నోకియా 8 దీపావళి కానుకుగా రాబోతోందా..?

హెచ్‌ఎండి గ్లోబల్ ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన నోకియా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ నోకియా 8 ఇండియాలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్ దీపావళి నాటికి మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో ఈ ఫోన్ ధర ఎంతుంటుదనేది తెలియాల్సి ఉంది. ప్రీమియమ్ డిజైనింగ్‌తో కనువిందు చేస్తోన్న ఈ ఫోన్‌లో అడుగడుగునా కొత్త ఫీచర్లే ఉన్నాయి.

Read More : మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ఇక మరింత సులభతరం!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

6000 సిరీస్ అల్యూమినియమ్ గ్రేడ్ మెటల్

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి నోకియా 8 పూర్తిస్థాయి యునిబాడీ డిజైన్‌తో వస్తోంది. 6000 సిరీస్ అల్యూమినియమ్ బ్లాక్‌తో ఈ ఫోన్ బాడీని బిల్డ్ చేసారు. 40-స్టేజ్ ప్రాసెస్‌తో కూడిన మెచీనింగ్, అనోడైజింగ్, పాలిషింగ్ వంటి అంశాలు ఫోన్ లుక్‌ను మరింత ప్రొఫెషనల్‌గా తీర్చిదిద్దాయి.

క్కాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్

నోకియా 8 స్మార్ట్‌ఫోన్ 5.3 అంగుళాల ఐపీఎస్ 2కే రిసల్యూషన్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ రక్షణ కవచంలా నిలుస్తుంది. క్కాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్ పై ఫోన్ రన్ అవుతుంది. 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

3090mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్...

నోకియా 8 స్మార్ట్‌ఫోన్ 3090mAh బ్యాటరీతో వస్తోంది. క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్టును ఈ బ్యాటరీ సపోర్ట్ చేస్తు్ంది. కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే.. 4జీ ఎల్టీఈ, బ్లుటూత్ 5.0, డ్యుయల్ సిమ్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్స్ ఈ డివైస్‌లో ఉన్నాయి.

కెమెరా ఫీచర్స్

నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌కు కెమెరా ఫీచర్స్ ప్రధాన హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ కెమెరాను హెచ్‌ఎమ్‌డి గ్లోబల్ సెటప్ చేసింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, పీడీఏఎఫ్, ఐఆర్ రేంజ్ ఫైండర్, f/2.0 అపెర్చుర్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఈ డ్యుయల్ కెమెరా సెటప్‌లో ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలను క్యాప్చుర్ చేయటంతో పాటు హైక్వాలిటీ వీడియో కాల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఫోన్‌లో పొందుపరిచిన డ్యుయల్ సైట్ ఫీచర్ ద్వారా ఒకేసారి ఫ్రంట్ ఇంకా బ్యాక్ కెమెరాల నుంచి ఫోటోలను క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది. ఈ సమయంలో ఫోన్ డిస్‌ప్లే పై split screen యాక్టివేట్ అవుతుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌

నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. త్వరలోనే ఆండ్రాయిడ్ ఓ అప్‌డేట్ కూడా ఈ ఫోన్‌కు లభించే అవకాశం ఉంది. లిక్విడ్ కూలింగ్, డ్యుయల్ సైట్, నోకియా OZO ఆడియో వంటి స్పెషల్ ఫీచర్లు నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. వీటితో పాటుగా వచ్చే IP54 రేటింగ్ ఫోన్‌ను నీటి ప్రమాదాల నుంచి రక్షిస్తుంది. లిక్విండ్ కూలింగ్ ఫీచర్ ఫోన్‌ను ఎప్పుడు కూల్‌గా ఉంచే ప్రయత్నం చేస్తుంది. ఇదే సమయంలో నోకియా OZO ఆడియో 4 మైక్రోఫోన్ల సహాయంతో హైక్వాలిటీ ఆడియోను ఆఫర్ చేస్తుంది.

యూరోపియన్ మార్కెట్లో €599

యూరోపియన్ మార్కెట్లో నోకియా 8 ధరను €599గా ఫిక్స్ చేసారు. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ ఖచ్చితంగా రూ.45000. సెప్టంబర్ నుంచి అన్ని ప్రముఖ మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. పాలిష్ కాపర్, బ్లు ఇంకా స్టీల్ కలర్ వేరియంట్ లలో ఈ ఫోన్ దొరుకుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 8 likely to launch in India during Diwali. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot