నోకియా 8 వచ్చేస్తోంది, ఇదిగోండి సాక్ష్యం

నోకియా హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 8కు సంబంధించి గతకొద్ది రోజులుగా అనేక విషయాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా వీటికి తెరదించుతూ నోకియా తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో నోకియా 8కు సంబంధించిన వివరాలను పోస్ట్ చేసింది. Baidu బ్రౌజర్‌లో హల్‌చల్ చేస్తోన్న ఈ లిస్టింగ్ తాలుకా ఇమేజ్‌ను ట్విట్టర్ యూజర్ Roland Quandt తన అకౌంట్ నంచి పోస్ట్ చేసారు. తాజాగా రివీల్ అయిన పోస్టింగ్‌ను బట్టి చూస్తుంటే నోకియా 8 రిలీజ్ జూలై 31న తధ్యంగా తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 8కు సంబంధించి లీకైన స్పెసిఫికేషన్స్..

5.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ 1440పిక్సల్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలోనే ఆండ్రాయిడ్ ఓ లేదా ఆండ్రాయిడ్ పి అప్‌డేట్), ర్యామ్ వేరియంట్స్ (4జీబి, 6జీబి), 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ Carl Zeiss optics.

సత్తా చాటిన నోకియా ఫోన్‌లు..

మన్నికైన ఫోన్‌లను రూపొందించటంలో లెజండరీ బ్రాండ్ నోకియాకు పెద్ద పేరే ఉంది. 1990 -2003 సంవత్సరాల మధ్య నోకియా నుంచి విడుదలైన ఫీచర్ ఫోన్‌లు ఏ స్ధాయిలో ప్రపంచ మార్కెట్లను శాసించాయో మనందరికి తెలుసు.

6000 సిరీస్ అల్యుమినియమ్ గ్రేడ్ మెటల్..

ఇప్పటి వరకు HMD Global అనౌన్స్ చేసిన మూడు నోకియా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో నోకియా 6 ఒకటి. 6000 సిరీస్ అల్యుమినియమ్ గ్రేడ్ మెటల్ తో క్రాఫ్ట్ చేయబడిన నోకియా 6 ఫోన్ మరింత మన్నికగాను ధృడంగానూ కనిపిస్తోంది.

అనేక విధాలుగా పరీక్షించి చూసారు

నోకియా 6 ధృడత్వాన్ని పరిశీలించే క్రమంలో JerryRigEverything అనే యూట్యూబ్ ఛానల్ తాజాగా ఓ ఆసక్తికర వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లను అనేక విధాలుగా పరీక్షించి చూసారు. అయినప్పటికి నోకియా 6 విజయవంతంగా పనిచేస్తోంది.

నోకియా 6 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.

నోకియా 6 డ్యూరబులిటీ టెస్ట్ వీడియో

నోకియా 6 డ్యూరబులిటీ టెస్ట్ వీడియో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 8 gets listed on official website ahead of July 31 launch. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot