విడుదలకు సిద్ధంగా నోకియా 8, నోకియా 7, నోకియా 2

ఈ ఏడాదికిగాను 7 నోకియా బ్రాండెడ్ ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురాబోతోన్నట్లు హెచ్‌‌ఎండి గ్లోబల్ కొద్ది నెలల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. హెచ్‌‌ఎండి గ్లోబల్ పేర్కొన్న విధంగానే ఇప్పటికే నాలుగు నోకియా ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. వాటిలో ఒకటి ఫీచర్ ఫోన్ కాగా, మిగిలిన మూడు ప్యూర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండవ విడత నోకియా స్మార్ట్‌ఫోన్‌లకు సిద్ధం..

2017 ప్రధమర్థాన్ని లక్ష్యంగా చేసుకుని మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 3310 (2017 వర్షన్), నోకియా 3, నోకియా 5, నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లు అంచనాలకు తగట్టుగానే దూసుకెళుతున్నాయి. ఇప్పుడు మనం దాదాపుగా 2017 ద్వితియార్థంలోకి వచ్చేసాం. ఈ నేపథ్యంలో రెండవ విడత నోకియా స్మార్ట్‌ఫోన్‌లను కూడా మార్కెట్లో లాంచ్ చేసేందుకు హెచ్‌‌ఎండి గ్లోబల్ సిద్థంగా ఉన్నట్లు తెలుస్తోంది.

నోకియా కొత్త ఫోన్‌‌లకు సంబంధించి ఆసక్తికర న్యూస్...

హెచ్‌‌ఎండి గ్లోబల్ మార్కెటింగ్ డైరెక్టర్ పెక్కా రంటాలా ఓ ఫిన్నిష్ పబ్లికేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నోకియా ఫోన్ కొత్త లాంచ్‌లకు సంబంధించి ఆసక్తికర వివరాలను రివీల్ చేసారు.

నోకియా 8, నోకియా 7, నోకియా 2...

ఈయన వెల్లడించిన వివరాల ప్రకారం.. నోకియా 8, నోకియా 7, నోకియా 2
స్మార్ట్‌ఫోన్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో నోకియా 8 మోడల్ వన్‌ప్లస్ 5, ఐఫోన్ 7, గెలాక్సీ ఎస్ 8 ఫోన్‌లకు పోటీగా నిలవనుందని సమచారం.

3జీ వేరియంట్‌లో నోకియా 3310

లో-ఎండ్, మిడ్ - రేంజ్, హై -ఎండ్ ఇలా వర్గాలను టార్గెట్ చేసే విధంగా ఈ నోకియా ఫోన్‌లు ఉంటాయని తెలుస్తోంది. వీటితో పాటు నోకియా3310 (2017 వర్షన్)ను 3జీ వేరియంట్‌లో కూడా లాంచ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

నోకియా 8 రూమర్ స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల Super AMOLED డిస్‌ప్లే, క్వాల్కమ్ సరికొత్త Snapdragon 835 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్ వేరియంట్స్(4జీబి,8జీబి), 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

నోకియా 8, నెంబర్ వన్ ఫోన్

నోకియా 6 విజయంతో మంచి ఊపు మీదున్న నోకియా చూస్తుంటే మరో విజయాన్ని అలవోకగా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాపిల్, సామ్‌సంగ్‌ల నుంచి ఈ ఏడాది లాంచ్ కాబోతోన్న(గెలాక్సీ ఎస్8, ఐఫోన్ 8) హైఎండ్ ఫోన్‌లను టార్గెట్ చేస్తూ నోకియా లాంచ్ చేయబోతున్న నోకియా 8 మరికొద్ది రోజుల్లో ప్రపంచం ముందుకు రాబోతోంది. GSM Arena తెలిపిన వివరాల ప్రకారం నోకియా 8 రెండు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

రెండు రకాల వేరియంట్‌లలో

Snapdragon 821 processor విత్ 8జీబి ర్యామ్, Snapdragon 835 processor విత్ 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5.7 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్), 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ కార్ల్ జిస్ ఆప్టిక్స్, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ స్పీకర్ సపోర్ట్.

నోకియా 7 రూమర్ స్పెసిఫికేషన్స్....

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ Snapdragon 660 ప్రాసెసర్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000mAh బ్యాటరీ.

నోకియా 2 ఎంట్రీ లెవల్ ఫోన్..

ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌గా భావిస్తోన్న నోకియా 2కు సంబంధించి స్పెసిఫికేషన్స్ రివీల్ కావల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 8, Nokia 7, Nokia 2 pegged for imminent launch, hints HMD executive. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot