నోకియా 8 అమ్మకాలు ప్రారంభం, ధర ఇదే

చైనా మార్కెట్లో మరో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ముందస్తు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. MWC 2017ను పురస్కరించుకుని ఫిబ్రవరి 26న బార్సిలోనాలో లాంచ్ అవుతోందని భావిస్తోన్న Nokia 8 ఫోన్‌ను చైనాకు చెందిన JD.comలో ఎక్స్‌క్లూజివ్ గా ప్రీ-ఆర్డర్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.

నోకియా 3310 ఇండియా రిలీజ్ ఎప్పుడు..?

నోకియా 8  అమ్మకాలు ప్రారంభం, ధర ఇదే

ధర 3,188 Yuanలుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువు సుమారుగా రూ.31,042గా ఉంటుంది. నోకియా 8 ఫోన్‌లకు సంబంధించిన మొదటి సేల్ ఎప్పుడు ఉంటుందనేది వీరు పేర్కొనలేదు.

నోకియా 8  అమ్మకాలు ప్రారంభం, ధర ఇదే

ఒకరి పేరు మీదే రెండు Jio సిమ్‌లు, మరో మోసం..

నోకియా 8 స్పెసిఫికేషన్స్

5.7 అంగుళాల Super AMOLED డిస్‌ప్లే, క్వాల్కమ్ సరికొత్త Snapdragon 835 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 8, నెంబర్ వన్ ఫోన్

నోకియా 6 విజయంతో మంచి ఊపు మీదున్న నోకియా చూస్తుంటే మరో విజయాన్ని అలవోకగా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాపిల్, సామ్‌సంగ్‌ల నుంచి ఈ ఏడాది లాంచ్ కాబోతోన్న(గెలాక్సీ ఎస్8, ఐఫోన్ 8) హైఎండ్ ఫోన్‌లను టార్గెట్ చేస్తూ నోకియా లాంచ్ చేయబోతున్న నోకియా 8 మరికొద్ది రోజుల్లో ప్రపంచం ముందుకు రాబోతోంది. GSM Arena తెలిపిన వివరాల ప్రకారం నోకియా 8 రెండు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.

రెండు రకాల వేరియంట్‌లలో

Snapdragon 821 processor విత్ 8జీబి ర్యామ్, Snapdragon 835 processor విత్ 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5.7 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్), 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ కార్ల్ జిస్ ఆప్టిక్స్, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ స్పీకర్ సపోర్ట్.

అప్‌కమింగ్ నోకియా స్మార్ట్‌ఫోన్స్..

అప్‌కమింగ్ నోకియా స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు ఆసక్తికర రూమర్స్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

నోకియా 'Heart'

నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో తిరిగి మొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన నోకియా మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌తో మార్కెట్లోకి దూసుకురాబోతోన్నట్లు వార్తలు వస్తున్నాయి. నోకియా 'Heart' పేరుతో ఈ ఫోన్ ఉండబోతోందని ప్రముఖ బెంచ్ మార్కింగ్ వెబ్ సైట్ GFXBench చెబుతోంది. ఈ వెబ్‌సైట్ వెల్లడించిన వివరాల ప్రకారం నోకియా హార్ట్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి..

ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 5.2 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 సాక్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 7 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. HMD Global ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరిలో జరగనున్న 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.

 

నోకియా పీ1

నోకియా 6 తరువాత నోకియా నుంచి రాబోతున్న హై-ఎండ్ ఫోన్ నోకియా పీ1 అని తెలుస్తోంది. ఈ ఫోన్‌ను 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ కి సంబంధించిన ధర ఇప్పుడు ఆన్‌లైన్ లో హల్ చల్ చేస్తోంది. 6 జిబి ర్యామ్ అలానే 256జిబి స్టోరేజ్ కెపాసిటీతో ఈ ఫోన్ బయటకు రానున్నట్లు కధనాలు వస్తున్నాయి.

నోకియా 6 కెమెరా..

కెమెరా విషయానికొస్తే 22.6 మెగా ఫిక్సల్ కెమెరాతో రానున్నట్లు రిపోర్టులను బట్టి తెలుస్తోంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. నోకియా పీ1 IP57 సర్టిఫైడ్ ని కూడా కలిగి ఉందట. బ్యాటరీ విషయానికొస్తే 3500mAh బ్యాటరీ. క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ . అలాగే ఫింగర్ ఫ్రింట్ స్కానర్ లాంటి ప్రత్యేక ఫీచర్లతో ఫోన్ వస్తుందని రిపోర్టులు చెబుతున్నాయి.

రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో.

Nokia P1 రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 5.2 అంగుళాల డిస్‌ప్లేతో, రెండవ వేరియంట్ 5.5 అంగుళాల డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. క్యూహైడెఫినిషన్ (2560 x 1440పిక్సల్స్) అమోల్డ్ డిస్‌ప్లే వ్యవస్థతో వస్తోన్నఈ ఫోన్స్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన నోకియా Z లాంచర్ యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతాయట. శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 821 లేదా స్నాప్‌డ్రాగన్ 835 SoCలను ఈ ఫోన్‌లలో నిక్షిప్తం చేసి ఉండొచ్చని ఆ రిపోర్ట్ పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 8 price is out; listed for pre-sale. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot