నోకియా 8 స్మార్ట్‌ఫోన్ రూ. 8 వేలు తగ్గింది, నోకియా 5 కూడా...

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన విషయం విదితమే. ఇప్పుడు ఈ ఫోన్ పై ఏకంగా రూ. 8 వేలు తగ్గిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.

By Hazarath
|

హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ తన నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది సెప్టెంబర్ నెలలో విడుదల చేసిన విషయం విదితమే. అధునాతన ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ లాంచింగ్ సమయంలో రూ.36,999గా నిర్ణయించింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్ పై ఏకంగా రూ. 8 వేలు తగ్గిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పుడు నోకియా 8ను రూ.28,999 ధరకే యూజర్లు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌తో పాటు నోకియా 5కు చెందిన 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధరను కూడా రూ.1వేయి తగ్గించారు. ఈ ఫోన్ ఇప్పుడు రూ.12,499 ధరతో మార్కెట్లో అందుబాటులో ఉంది. కాగా పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో ఈ మోడల్ ధర రూ.11,299గా ఉంది.

దడపుట్టిస్తున్న నోకియా 8 బోథీ ఫీచర్‌, అసలేంటి ఇది..?దడపుట్టిస్తున్న నోకియా 8 బోథీ ఫీచర్‌, అసలేంటి ఇది..?

నోకియా 8 ఫీచర్స్‌

నోకియా 8 ఫీచర్స్‌

5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 2560 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 835 ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 13 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ రియ‌ర్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, బారోమీట‌ర్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ, 3090 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 3.0

తొలి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌

తొలి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌

ఒకేసారి రెండు కెమెరాలతో ఫోటోలు తీసుకునే విధంగా నోకియా8 మార్కెట్లోకి దూసుకొచ్చింది. దీని ద్వారా మీరు ఏకకాలంలో సెల్ఫీ, బ్యాక్ కెమెరా నుంచి ఫోటోలు తీసుకోవచ్చు. డ్యూయెల్‌ సైట్‌ మోడ్‌ ఫీచర్‌తో వస్తోన్న తొలి అంతర్జాతీయ స్మార్ట్‌ఫోన్‌ ఇదే. జీస్‌ ఆప్టిక్స్‌ కెమెరాలతో 4కే వీడియోలను తీసుకోవచ్చు.

నోకియా ఓజో ఆడియో..

నోకియా ఓజో ఆడియో..

అదేవిధంగా నోకియా ఓజో ఆడియోతో నోకియా 8 దూసుకొచ్చింది. మెరుగైన మల్టిమీడియా అనుభవం కోసం 360 డిగ్రీ ఆడియో టెక్నాలజీని ఇది కలిగి ఉంది.వెనుక వైపు రెండు 13 మెగాపిక్సెల్‌ సెన్సార్లను కలిగి ఉండనున్నాయి. 4కె వీడియోతో మీరు వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

3 మైక్రోఫోన్లు

3 మైక్రోఫోన్లు

ఈ ఫోన్‌లో 3 మైక్రోఫోన్లను ఏర్పాటు చేశారు. దీని వల్ల నాణ్యమైన ఆడియో వినడమే కాదు, ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే శబ్దాలు తగ్గుతాయి. దీంతో నాణ్యమైన కాల్ క్వాలిటీ లభిస్తుంది.ఈ ఫోన్‌లో ఉన్న కెమెరా యాప్‌తో నేరుగా ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో లైవ్ వీడియో స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. అందుకు అనుగుణంగా నోకియా 8 కెమెరా యాప్‌ను తీర్చిదిద్దారు.

 

 

నోకియా 5

నోకియా 5

నోకియా 5 కూడా ఇప్పుడు రూ.1000 తగ్గింపు ధరలో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ ఫోన్‌ను యూజర్లు కొనుగోలు చేయవచ్చు.
నోకియా 5 ఫీచర్లు
5.2 ఇంచ్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్

కాగా తగ్గిన ధర ప్రకారం నోకియా 8 ఫోన్‌ను అమెజాన్ విక్రయిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్ నోకియా 5 ఫోన్‌ను విక్రయించనుంది.

Best Mobiles in India

English summary
Nokia 8 gets massive Rs 8,000 price cut, Nokia 5 gets Rs 1,000 discount More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X