ఆగష్టు 16న నోకియా 8 లాంచ్

హెచ్‌ఎండి గ్లోబల్ నుంచి మరో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. నోకియా 8 పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఆగష్టు 16న లండన్‌లో నిర్వహించే ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా ఈ ఫోన్ ప్రపంచానికి పరిచయం కాబోతోంది.

Read More : అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్, 9 హాట్ హాట్ ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నోకియా 8లో హైలైట్ ఫీచర్స్

నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌లో హైలైట్ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. వాటిలో డ్యుయల్ లెన్స్ కెమెరా ఒకటి. Carl-Zeiss opticsతో వస్తోన్న ఈ డ్యుయల్ కెమెరా యూజర్లకు క్వాలిటీ విషయంలో ఏమాత్రం నిరుత్సాహపరచదు.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్

ఈ ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్. మార్కెట్‌లోని లీడింగ్ ప్రాసెసర్‌లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ఫోన్ ను మరింత వేగంగా ముందుకు నడిపిస్తుంది. నోకియా 8కు సంబంధించి మిగిలిన స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

నోకియా 8 స్పెసిఫికేషన్స్..

5.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ సపోర్ట్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ. ఇండియన్ మార్కెట్లో నోకియా 8 ధర రూ.40,000 పైనే ఉండొచ్చని సమాచారం.

3జీ వేరియంట్‌లో నోకియా 3310

ఇదే ఈవెంట్‌లో భాగంగా నోకియా 3310 3జీ వర్షన్‌ను కూడా హెచ్‌ఎండి గ్లోబల్ రివీల్ చేసే అవకాశముంది. ఈ ఫోన్ ఇండియాలో అందుబాటులో ఉంటుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. 

ఇదే ఈవెంట్‌లో నోకియా 9 కూడా..

అనధికారికంగా తెలియవచ్చిన సమచారం ఇదే ఈవెంట్‌లో భాగంగా నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ను కూడా హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.

నోకియా9 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉండొచ్చు..

5.5 అంగుళాల క్యూహైడెఫినిషన్ OLED డిస్‌ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 6జీబి ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 22 మెగా పిక్సల్ డ్యుయల్ Carl-Zeiss రేర్ ఫేసింగ్ కెమెరా, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3800mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్-ఛార్జ్ 4 సపోర్ట్. 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 8 Rumour Roundup: All You Need to Know Before August 16 Launch. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot