సరికొత్త నోకియా 8 సిరోకో ఫీచర్లు చూస్తారా..!

|

నోకియా బ్రాండ్ పేరిట స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న హెచ్ ఎండీ గ్లోబల్ కంపెనీ దూకుడు పెంచింది. నోకియా పేరిట తాజాగా నోకియా సరికొత్త స్మార్ట్ ఫోన్ మోడళ్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. గూగుల్ యాండ్రాయిడ్ వన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ మోడల్స్ ను విడుదల చేయనున్నాయి. అంటే ఈ మోడల్ ఫోన్లలో కచ్చితంగా యాండ్రాయిడ్ సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తుంటాయి. అలాగే ప్రతీ రెండేళ్లకు ఒకసారి యాండ్రాయిడ్ వర్షన్ అప్ డేట్స్ కూడా ఇందులో పొందవచ్చు. సాధారణంగా చాలా వరకూ స్మార్ట్ ఫోన్ ఉత్పత్తిదారులు గూగుల్ అందించే అప్ డేట్స్ ను వినియోగదారులకు అందించడంలో వెనుకబడి ఉన్నాయి. అందుకు పరిష్కారంగా నే యాండ్రాయిడ్ వన్ ప్రొగ్రాంలో పలు స్మార్ట్ ఫోన్ లు భాగస్వామ్యం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే సిరీస్ లో నోకియా బ్రాండ్ నుంచి నోకియా 6, 7, 8 సిరీస్ ఫోన్లను 2018 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో విడుదల చేసింది హెచ్ ఎండీ గ్లోబల్.అయితే ప్రస్తుతం నోకియా 8 సిరోకో ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..

 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ వాడుతున్నారా? ఈ 8 సీక్రెట్లు గురించి తెలుసుకోవాల్సిందేఆండ్రాయిడ్ స్మార్ట్‌‌ఫోన్ వాడుతున్నారా? ఈ 8 సీక్రెట్లు గురించి తెలుసుకోవాల్సిందే

ధర రూ.49,999

ధర రూ.49,999

గత సంవత్సరం స్పెషల్ ఎడిషన్ ఫోన్ తరహాలో విడుదల అయిన నోకియా 8800 సిరోకో హై ఎండ్ ఫోన్ మార్కెట్లో ఒక సంచలనంగా మారనుంది. దీని ధర వచ్చేసి భారతీయ మార్కెట్లో రూ.49,999 గా నిర్ణయించారు. దీనికి మార్కెట్లో పోటీనిచ్చే హైఎండ్ ఫోన్లలో గూగుల్ పిక్సెల్ 2, హెచ్ టీసీ యూ11 మాత్రమే ఉన్నాయి. దీని ధరకు తగినట్లుగానే ఫీచర్లు సైతం అదరగొడుతున్నాయి.

నోకియా 8 సిరోకో డిజైన్ :

నోకియా 8 సిరోకో డిజైన్ :

డిజైన్ పరంగా నోకియా 8 సిరోకో చాలా స్టైలిష్ లుక్ తో కనబడనుంది. ముఖ్యంగా దీనికి టైప్ సీ హెడ్ ఫోన్స్ ఇచ్చారు. అలాగే సాధారణంగా అన్ని ఫోన్లకు ఉన్నట్లు 3.5 ఎంఎం హెడ్ ఫోన్ సాకెట్ దీనిలో ఉండదు. ఇందుకోసం ఒక ప్రత్యేక డాంగిల్ ఇచ్చారు. దీని ద్వారా మాత్రమే హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిజైన్ పరంగా చూసినట్లయితే ఈ ఫోన్ బ్యాక్ సైడ్ మొత్తం గ్లాసీ లుక్ ఇచ్చారు. అలాగే ఫోన్ ఎడ్జెస్‌లో కర్వ్‌డ్ డిస్ ప్లే సైతం ఫోన్ లుక్ ను తళతళలాడిస్తోంది. అలాగే అలాగే చాలా 7.5 ఎంఎం స్లిమ్ బాడీని నోకియా 8 సిరోకో కలిగిఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 తరహాలోనే ..
 

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 తరహాలోనే ..

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 తరహాలోనే డిజైన్ కనిపిస్తున్నప్పటికీ ఈ ఫోన్ ఇందులో పవర్ అలాగే వేల్యూం బటన్స్ బాడీపై కనబడకుండా, గమనిస్తే కానీ గుర్తించని తరహాలో డిజైన్ చేసారు. అలాగే సింగిల్ సిమ్ కార్డ్ స్లాట్ తో పాటు యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ ను కలిగి ఉంది. గ్లాసీ లుక్‌తో పాటు, డ్యుయర్ కెమెరా సెటప్ ను నోకియా 8 కలిగి ఉంది. అలాగే ఫింగర్‌ప్రింట్ రికగ్నైజింగ్ కూడా ఇందులో ప్రత్యేకతగా చెప్పాలి.

నోకియా 8 సిరోకో ప్రత్యేకతలు :

నోకియా 8 సిరోకో ప్రత్యేకతలు :

5.5 ఇంచ్ క్యూహెచ్‌డీ పీఓలెడ్‌ డిస్‌ప్లే తో పాటు స్క్రీన్ రిజల్యూషన్ 2560 x 1440 పిక్సెల్స్‌ కలిగిఉంది. అలాగే ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ తో పాటు ఆండ్రాయిడ్ వన్‌ సపోర్ట్ కలిగిఉంది. ఇక సామర్థ్యం విషయానికి వస్తే 6 జీబీ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇన్‌బిల్ట్‌ స్టోరేజ్. దీని ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.

బ్యాటరీ సామర్థ్యం, కెమెరా ఫీచర్స్ :

బ్యాటరీ సామర్థ్యం, కెమెరా ఫీచర్స్ :

ఇక బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే 3260 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. ఫాస్ట్ చార్జింగ్ తో పాటు రోజంతా హెవీగా వాడుకునేందుకు ఈ బ్యాటరీ ద్వారా వీలు కలిగింది.

 కెమెరా విషయానికి వస్తే

కెమెరా విషయానికి వస్తే

ఇక కెమెరా విషయానికి వస్తే 12+13 ఎంపీ డ్యుయల్ రియర్‌ కెమెరాతో, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందిస్తున్నారు. దీని ద్వారా 4కే క్వాలిటీ వీడియోలను సైతం తీసే వీలుంది. తక్కువ లైటింగ్ లోనూ అందమైన సెల్ఫీలను తీసుకునే వీలుంది.అలాగే మూవింగ్ ఫోటోలను తీసినప్పటికీ చాలా క్లారిటీగా ఫోటోలను కాప్చర్ చేయడం దీని ప్రత్యేకత. డేలైట్ లో సైతం చక్కటి ఆటోఫోకస్ దీని ప్రత్యేకత. అలాగే నోకియా 9 తయారు అయ్యే వరకూ ఇదే హెచ్ఎండీ గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లా నిలవనుంది.

Best Mobiles in India

English summary
Today, we’ll be reviewing the Nokia 8 Sirocco - a special edition of last year’s Nokia 8 (Review) smartphone that’s an ode to the original Nokia 8800 Sirocco

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X