నోకియా 8 సిరోకో vs నోకియా 7 ప్లస్ vs నోకియా 8, బెస్ట్ ఏదీ...?

హెచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలోని నోకియా మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. నోకియా సిరోకో, నోకియా 7 ప్లస్, నోకియా 6 (2018) మోడల్స్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి

|

హెచ్‌ఎండి గ్లోబల్ నేతృత్వంలోని నోకియా మూడు సరికొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. నోకియా సిరోకో, నోకియా 7 ప్లస్, నోకియా 6 (2018) మోడల్స్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో హై-ఎండ్ ఫోన్‌గా భావిస్తోన్న నోకియా సిరోకో ధర ఇండియన్ మార్కెట్లో రూ.49,999గా ఉంటుంది. మరో ఫోన్ నోకియా 7 ప్లస్ ధర రూ.25,999గా ఉంటుంది. వీటిలో చివరి మోడల్ అయిన నోకియా 6 (2018) ధర రూ.16,999. నోకియా 6 (2018) అమ్మకాలు ఏప్రిల్ 6 నుంచి మార్కెట్లో ప్రారంభమవుతాయి. ఇదే సమయంలో నోకియా సిరోకో, నోకియా 7 ప్లస్‌లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్స్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమవుతాయి.

 

ప్రయాణికులకు IRCTC బంపరాఫర్, రూ.10 వేల నగదు మీ సొంతంప్రయాణికులకు IRCTC బంపరాఫర్, రూ.10 వేల నగదు మీ సొంతం

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి...

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి...

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు స్లీక్ ఇంకా స్టైలిష్‌గా కనిపిస్తాయి. 6000 సిరీస్ అల్యుమినియమ్ క్రాఫ్ట్ గ్రేడ్ మెటల్‌తో బిల్డ్ కాబడిన ఈ ఫోన్‌లకు గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ అదనపు అట్రాక్షన్‌గా నిలుస్తుంది. నోకియా 7 ప్లస్‌కు కాపర్ ఎడ్జ్‌లు హైలైట్‌గా నిలిస్తే, నోకియా 8 సిరోకో మోడల్‌కు స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రేమ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది.

ఐపీ68 సర్టిఫికేషన్‌...

ఐపీ68 సర్టిఫికేషన్‌...

ఐపీ68 సర్టిఫికేషన్‌తో వస్తోన్న నోకియా 8 ఫోన్ నీరు ఇంకా దుుమ్ము ద్వారా తలెత్తే ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది. ఇదే సమయంలో ఈ ఫోన్ డిస్‌ప్లే పై అమర్చిన గొరిల్లా గ్లాస్ 5 దృడమైన ప్రొటెక్షన్‌ను ఆఫర్ చేస్తుంది. ఫుల్‌విజన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది వెనుక భాగంలో నిక్షిప్తం చేయబడి ఉంటుంది.

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి...
 

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి...

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి Nokia 8 Sirocco క్యూహెచ్‌డి రిసల్యూషన్‌తో కూడిన 5.5 అంగుళాల పీఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 2560 x 1440 పిక్సల్స్)తో వస్తోంది. మరోఫోన్ Nokia 7 Plus ఫుల్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 6 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే(రిసల్యూషన్ కెపాసిటీ 2160 x 1080 పిక్సల్స్)తో వస్తోంది. ఇదే సమయంలో గతంలో లాంచ్ అయిన Nokia 8, 5.3 అంగుళాల పీఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ 2560 x 1440 పిక్సల్స్)తో వస్తోంది.

 హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే..

హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే..

ఈ ఫోన్‌లకు సంబంధించి హార్డ్‌వేర్ అంశాలను పరిశీలించినట్లయితే నోకియా 8 సిరోకో ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఇదే సమయంలో నోకియా 7 ప్లస్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 660 సాక్ పై రన్ అవుతుంది. గతంలో లాంచ్ అయిన Nokia 8 కూడా ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్ పై రన్ అవుతుండటం విశేషం.

ర్యామ్ ఇంకా స్టోరేజ్ స్పెసిఫికేషన్స్..

ర్యామ్ ఇంకా స్టోరేజ్ స్పెసిఫికేషన్స్..

ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి నోకియా 8 సిరోకో మోడల్ 6జీబి ర్యామ్ + 128జీబి ఇంటర్నల్ స్టోరజ్‌తోనూ, నోకియా 7 ప్లస్ మోడల్ 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరజ్‌తోనూ లభ్యమవుతాయి. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్స్ ద్వారా వీటి స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు. ఇదే సమయంలో గతంలో లాంచ్ అయిన నోకియా 8 మోడల్ 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరజ్‌తో లభ్యమవుతోంది.

బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ కెపాసిటీ..

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి నోకియా 8 సిరోకో మోడల్ 3260mAh ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీతో వస్తోంది. ఈ బ్యాటరీ క్యూఐ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది. మరోవైపు నోకియా 7 ప్లస్ ఫోన్ 3800mAh ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీతో వస్తోంది. ఇదే సమయంలో గతంలో లాంచ్ అయిన నోకియా 8 మోడల్ 3260mAh బ్యాటరీతో వస్తోంది.

కెమెరా స్పెసిఫికేషన్స్..

కెమెరా స్పెసిఫికేషన్స్..

ఈ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి కెమెరా స్పెక్స్‌ను పరిశీలించినట్లయితే నోకియా 8 సిరోకో అలానే నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు కార్ల్‌జిస్ ఆప్టిక్స్‌తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌లతో వస్తున్నాయి. ఈ రెండు ఫోన్‌లు 12 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా అలానే 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను కలిగి ఉన్నాయి. ఇదే సమయంలో నోకియా 8 మోడల్ 13 మెగా పిక్సల్ డ్యుయల్ లెన్స్ రేర్ కెమెరాతో పాటు 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది.

సాఫ్ట్‌వేర్ ...

సాఫ్ట్‌వేర్ ...

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి నోకియా 8 సిరికో ఇంకా నోకియా 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. త్వరలోనే వీటికి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అప్‌డేట్ లభించే వీలుంది. ఇదే సమయంలో నోకియా 8 స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోంది. త్వరలోనే ఈ హ్యాండ్‌సెట్‌కు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో అప్‌డేట్ లభించే వీలుంంది.

Verdict

Verdict

నూతనంగా లాంచ్ అయిన నోకియా 8 సిరోకో స్మార్ట్ ఫోన్ ను కొద్ది నెలల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 8తో కంపేర్ చేసి చూసినట్లయితే అన్ని విభాగాల్లోనూ నోకియ సిరోకో మోడల్ ముందంజలో ఉంది. ధర విషయానికి వచ్చేసరికి ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 8 స్మార్ట్‌ఫోన్ రూ.36,999 ధర ట్యాగ్‌తో మార్కెట్లో ట్రేడ్ అవుతుండగా, నోకియా 8 సిరోకో రూ.49,999 ధర ట్యాగ్‌తో లాంచ్ కాబోతోంది.

 

 

Best Mobiles in India

English summary
HMD Global held an event today in India to launch the Nokia 8 Sirocco, Nokia 7 Plus and new Nokia 6 smartphones in the country. These smartphones have been launched for Rs. 49,999, Rs. 25,999 and Rs. 16,999 respectively.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X