ఆ రెండు ఫోన్లకు డేంజర్ బెల్స్ : ఇండియాలో నోకియా 8 లాంచ్ ఈ రోజే !
ఐఫోన్ 8, గెలాక్సీ ఎస్8లకు ధీటుగా నోకియా 8, ఇండియాలో ఈ రోజే లాంచ్. హైలెట్స్‌పై ఓ లుక్కేయండి
నోకియా అభిమానులు ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నోకియా హై ఎండ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 8ను ఈ రోజే లాంచ్ చేసేందుకు హెచ్‌ఎండీ గ్లోబల్ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్ ఫీచర్లు ఐఫోన్ 8, గెలాక్సీ ఎస్8లకు ధీటుగా ఉన్నాయని తెలుస్తోంది. ఫీచర్లపై ఓ లుక్కేయండి.

13 మెగాపిక్సెల్ సెన్సార్లను
వెనుక వైపు రెండు కెమెరాలతో నోకియా 8 భారత మార్కెట్‌లోకి వస్తోంది. ఈ రెండు 13 మెగాపిక్సెల్ సెన్సార్లను కలిగి ఉండనున్నాయి. 4కె వీడియోతో మీరు వీడియోలను రికార్డ్ చేయవచ్చు.

నోకియా ఓజో ఆడియోతో
అదేవిధంగా నోకియా ఓజో ఆడియోతో రాబోతున్న కంపెనీ తొలి డివైజ్ కూడా నోకియా 8 స్మార్ట్‌ఫోనే. మెరుగైన మల్టిమీడియా అనుభవం కోసం 360 డిగ్రీ ఆడియో టెక్నాలజీని ఇది కలిగి ఉంది.

ఫీచర్లన్నీ..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న ఫీచర్లన్నీ దాదాపు శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఐఫోన్లకు గట్టిపోటీ ఇచ్చే మాదిరే ఉన్నాయి. దానికి సరైన పోటీగా ఇది నిలుస్తుందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

నోకియా 8 ఫీచర్స్
5.3 అంగుళాల క్యూహెచ్‌డీ డిస్‌ప్లే
1440 x 2560 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్
4 జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
256 జీబీ వరకు విస్తరణ మెమరీ
13 ఎంపీ డబుల్ రియర్ కెమెరా(4కే వీడియో)
13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3090 ఎంఏహెచ్ బ్యాటరీ

హైఎండ్ స్మార్ట్‌ఫోన్ ధర
ఈ హైఎండ్ స్మార్ట్‌ఫోన్ ధరను ఇండియాలో కంపెనీ ఎంత నిర్ణయిస్తుందనేది ఈ రోజు తెలుస్తుంది. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర దాదాపు రూ. 45 వేల దాకా ఉంది.


Click it and Unblock the Notifications