నోకియా 8, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1, వన్‌ప్లస్ 5.. వీటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది?
నోకియా 8, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1, వన్‌ప్లస్ 5.. వీటిలో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏదో మీరే డిసైడ్ చేయండి
Nokia 8 లాంచ్‌తో హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ రేసులోకి హెచ్‌ఎండి గ్లోబల్ అడుగుపెట్టేసింది. క్వాడ్ హైడెఫినిషన్ స్ర్కీన్, స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ వంటి శక్తివంతమైన ఫీచర్లతో లాంచ్ అయిన ఈ నోకియా 8 ధర రూ.36,999. ఇండియన్ మార్కెట్లో అక్టోబర్ 14 నుంచి లభ్యం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే మార్కెట్లో సేల్ అవుతోన్న OnePlus 5కు ప్రధాన పోటీగా నిలిచింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా సోనీ తన Xperia XZ1 ఫోన్‌ను కొద్ది రోజుల క్రితమే ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది.

ఫీచర్స్ అలానే స్పెసిఫికేషన్స్ పరంగా ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు నెక్ టు నెక్ తలపడుతున్నాయి. వీటిలో బెస్ట్ మోడల్‌ను ఎంపిక చేసుకోవాలంటే, ఈ మూడు ఫోన్‌లకు సంబంధించిన సమగ్రమైన విశ్లేషణ మీ వద్ద ఉండాల్సిందే.
నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌ను సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1 అలానే వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్‌లతో కంపేర్ చేస్తూ ఓ విశ్లేషణాత్మక కథనాన్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతోంది. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ మూడు ఫోన్‌లకు సంబంధించిన ధరలు, మార్కెట్లో వీటి అందుబాటుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం..
ఇండియన్ మార్కెట్లో నోకియా 8 స్మార్ట్‌ఫోన్ ధరను రూ.36,999గా హెచ్‌ఎండి గ్లోబల్ నిర్ణయించింది. అక్టోబర్ 14 నుంచి ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ఇండియాతో పాటు క్రోమా, రిలయన్స్, సంగీతా మొబైల్స్, పూర్వికా, బిగ్‌సీ తదితర స్టోర్‌లలో ఈ ఫోన్ లభ్యమవుతంది. నోకియా 8 స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు కలర్ వేేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది.
వాటి వివరాలు.. పాలిష్ బ్లూ, టెంపర్డ్ బ్లూ ఇంకా స్టీల్ కలర్. లాంచ్ ఆఫర్ క్రింద ఈ ఫోన్ కొనుగోలు పై 100జీబి అదనపు డేటాను జియో యూజర్లు పొందే వీలుంటుంది. ఈ 100జీబి డేటా 10 దఫాలుగా యూజర్ అకౌంట్‌లోకి చేరుతుంది. రూ.309 అంతకన్నా ఎక్కువ మొత్తంలో రీఛార్జ్ చేయించుకున్న ప్రతిసారి 10జీబి చొప్పున అదనపు డేటా యాడ్ అవుతుంటుంది. నోకియా 8 యూజర్లకు దేశవ్యాప్తంగా 50 నగరాల్లో స్పెషల్ నోకియా మొబైల్ కేర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
ఇక Sony Xperia XZ1 విషయానికి వచ్చేసరికి, ఇండియన్ మార్కెట్లో ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.44,990గా ఉంది. సెప్టంబర్ 25 నుంచి సేల్ స్టార్ట్ అయ్యింది. అన్ని ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఈ ఫోన్ ట్రేడ్ అవుతోంది. ఈ డివైస్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఫోన్ కొనుగోలు పై Quick Charger 3.0 UCH1.2 కిట్ ఉచితంగా లభిస్తుంది. ఇక లాంచ్ ఆఫర్స్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్‌తో పాటు స్టైల్ స్టాండ్ కవర్‌ను కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ క్రింద రూ.1000 లభిస్తుంది. HDFC, ICICI క్రెడిట్ కార్డ్ యూజర్లకు 5శాతం క్యాష్‌బ్యాక్‌తో పాటు జీరో పర్సంట్ ఈఎమ్ఐ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.
ఈ జాబితాలో చిట్టచివరి ఫోన్ అయిన OnePlus 5 విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ మొత్తం రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో మొదటి వేరియంట్ వచ్చేసరికి 6జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్‌తో లభిస్తుంది. ధర రూ.32,999. రెండవ వేరియంట్ వచ్చేసరికి 8జీబి ర్యామ్ + 128జీబి స్టోరేజ్ కెపాసిటీతో లభిస్తుంది. ధర రూ.37,999. Amazon Indiaలో ట్రేడ్ అవుతోన్న ఈ ఫోన్‌లను అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుల ద్వారా కొనుగోలు చేసినట్లయితే రూ.1500 వరకు ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
నో కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ పై ఈ ఫోెన్‌లను సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ ఫోన్‌ల పై అందుబాటులో ఉంచిన ఇతర ఆఫర్‌లను పరిశీలించినట్లయితే 75జీబి వొడాఫోన్ డేటాతో పాటు మూడు నెలల వొడాఫోన్ ప్లే యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. మరో ఆఫర్స్‌లో భాగంగా కైండిల్ ఈబుక్స్ పై రూ.500 వరకు ప్రమోషనల్ క్రెడిట్, 12-నెలల యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్, అమెజాన్ పే బ్యాలన్స్ పై రూ.250 క్యాష్‌బ్యాక్, హ్యాండ్‌సెట్‌కు సంబంధించిన కేసెస్ అలానే కవర్స్ కొనుగోలు పై 70 శాతం వరకు రాయితీ, క్లియర్ ట్రిప్ నుంచి రూ.25,000 వరకు డిస్కౌంట్ ఓచర్స్ ఈ ఫోన్ కొనుగోలు పై లభిస్తాయి.

ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లకు కెమెరా ఫీచర్ ప్రధాన హైలైట్..
నోకియా 8, సోనీ ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1, వన్‌ప్లస్ 5.. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు విప్లవాత్మక కెమెరా ఫీచర్లతో వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారికి ఈ ఫోన్‌లు బోలేడన్ని ఆప్షన్స్‌ను అందిస్తున్నాయి.
ముందుగా నోకియా 8 స్మార్ట్‌ఫోన్ కెమెరా డిపార్ట్‌మెంట్‌ను పరిశీలించినట్లయితే, హెచ్‌ఎండి గ్లోబల్ ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా 'bothies' పేరుతో విప్లవాత్మక కెమెరా ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఫోటోస్ అలానే వీడియోలను ఫోన్ ఫ్రంట్ ఇంకా రేర్ కెమెరాల ద్వారా ఒకేసారి క్యాప్చుర్ చేసుకోవచ్చు.
నోకియా 8 కెమెరాలో పొందుపరిచిన మరో ఫీచర్ వన్-టచ్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఫేస్‌బుక్ అలానే యూట్యూబ్ లైవ్ వీడియోలను నిర్వహించుకోవచ్చు. స్పాటియల్ 360-డిగ్రీ ఆడియో రికార్డింగ్ నిమిత్తం OZO Audio టెక్నాలజీని ఈ ఫోన్‌లో హెచ్‌ఎండి గ్లోబల్ నిక్షిప్తం చేసింది. నోకియా 8 కెమెరాకు ఆడియో ఫోకస్ మోడ్ మరో ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన డ్యుయల్ కెమెరా సెటప్ రెండు 13 మెగా పిక్సల్ సెన్సార్‌లతో వస్తోంది. వీటిలో ఒకటి RGB సెన్సార్ కాగా మరొకటి monochrome సెన్సార్.
ఈ రెండు సెన్సార్లు f/2.0 అపెర్చుర్‌తో పాటు 1.12-మైక్రాన్ పిక్సల్ ఎలిమెంట్స్, ఫేస్‌డిటెక్షన్ ఆటోఫోకస్ (పీడీఏఎఫ్), డ్యుయల్-టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఐఆర్ రేంజ్ ఫైండర్ వంటి ఫీచర్లను కలిగి ఉంటాయి. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 13 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది. ఈ సెన్సార్‌లో 78.4 డిగ్రీ వైడ్-యాంగిల్ లెన్స్‌తో పాటు f/2.0 అపెర్చుర్, 1.12-మైక్రాన్ పిక్సల్ ఎలిమెంట్స్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ (పీడీఏఎఫ్) వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌లో ఫిట్ చేసిన మూడు కెమెరాలు Carl Zeiss opticsతో వస్తున్నాయి.
Sony Xperia XZ1 కెమెరా డిపార్ట్‌మెంట్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ వెనుక భాగంలో 3డీ స్కానింగ్ సామర్థ్యాలతో కూడిన మోషన్‌ఐ 19 మెగా పిక్సల్ Exmor RS సెన్సార్ కెమెరాను ఏర్పాటు చేయటం జరిగింది. 5-యాక్సిస్ స్టెబిలైజేషన్‌తో వస్తోన్న ఈ కెమెరా ద్వారా స్లో-మోషన్ వీడియోలను 960fps వేగంతో రికార్డ్ చేసుకోవచ్చు.
4కే క్వాలిటీ వీడియోలను కూడా ఈ కెమెరా రికార్డ్ చేస్తుంది. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హైక్వాలిటీ గ్రూప్ సెల్ఫీలను క్యాప్చుర్ చేసుకోవచ్చు.ఈ సెన్సార్‌లో f/2.0 అపెర్చుర్‌తో పాటు 22mm వైడ్-యాంగిల్ లెన్స్‌ను సోనీ పొందుపరిచింది.
నోకియా 8, ఎక్స్‌పీరియా ఎక్స్‌జెడ్1 స్మార్ట్ ఫోన్ తరహాలో OnePlus 5 స్మార్ట్‌ఫోన్ కూడా డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తోంది. ఈ ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ సెన్సార్‌లు f/1.7, f/2.6 అపెర్చుర్‌లతో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి.
4కే క్వాలిటీ వీడియోలను ఈ కెమెరా ద్వారా రికార్డ్ చేసుకోవచ్చు. ఫోన్ ముందు భాగంలో అమర్చిన 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ద్వారా హై-క్వాలిటీ వీడియోలతో పాటు సెల్ఫీలను చిత్రీకరించుకునే వీలుంటుంది. Auto HDR సపోర్ట్‌తో వస్తోన్న ఈ కెమెరా ద్వారా ఫుల్ హైడెఫినిషన్ వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు.

Nokia 8 స్పెసిఫికేషన్స్...
5.3 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ (1440x 2560పిక్సల్స్) ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం (అప్‌గ్రేడబుల్ విత్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో), క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ + 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3090mAh బ్యాటరీ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, IP54 సర్టిఫికేషన్.

Sony Xperia XZ1 స్పెసిఫికేషన్స్..
5.2 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ (1080x1920 పిక్సల్స్) హెచ్‌డీఆర్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 19 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2700mAh బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్, 4G VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ, యూఎస్బీ ఆన్ ద గో, IP68 సర్టిఫికేషన్.

OnePlus 5 స్పెసిఫికేషన్స్..
5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ ఆప్టిక్ అమోల్డ్ డిస్‌ప్లే (1920 x 1080పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 సాక్, ర్యామ్ వేరియంట్స్ (6జీబి, 8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), 16 మెగా పిక్సల్ + 20 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3300mAh బ్యాటరీ వత్ డాష్ ఛార్జ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్ వీ5.0, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లు వన్‌ప్లస్ 5లో ఉన్నాయి.


Click it and Unblock the Notifications








