నోకియా 8, నెం.1 ఫోన్ కాబోతుందా?

నోకియా 6 విజయంతో మంచి ఊపు మీదున్న నోకియా చూస్తుంటే మరో విజయాన్ని అలవోకగా అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నోకియా 8, నెం.1 ఫోన్ కాబోతుందా?

రెండు ఫ్రంట్ కెమెరాలతో.. (Vivo V5 Plus రివ్యూ)

యాపిల్, సామ్‌సంగ్‌ల నుంచి ఈ ఏడాది లాంచ్ కాబోతోన్న(గెలాక్సీ ఎస్8, ఐఫోన్ 8) హైఎండ్ ఫోన్‌లను టార్గెట్ చేస్తూ నోకియా లాంచ్ చేయబోతున్న నోకియా 8 మరికొద్ది రోజుల్లో ప్రపంచం ముందుకు రాబోతోంది. GSM Arena తెలిపిన వివరాల ప్రకారం నోకియా 8 రెండు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ అనధికారిక స్పసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి...

నోకియా 8, నెం.1 ఫోన్ కాబోతుందా?

1జీబి ధరకే 15జీబి 4జీ డేటా

Snapdragon 821 processor విత్ 8జీబి ర్యామ్, Snapdragon 835 processor విత్ 6జీబి ర్యామ్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5.7 అంగుళాల డిస్ ప్లే (రిసల్యూషన్2560× 1440పిక్సల్స్), 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ కార్ల్ జిస్ ఆప్టిక్స్, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ స్పీకర్ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చరిత్ర సృష్టించిన ఫోన్‍‌‌లు

ఫోన్ లేకుండా ఈ రోజుల్లో బయట అడుగుపెట్టడం చాలా కష్టం. ఎక్కడకెళ్లినా మన చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అయితే ఈ మొబైల్ ఫోన్లు మొదటి నుంచి ఎలా ఉన్నాయి..ఎలా మారుతూ వచ్చాయి అనే విషయాలను మనం గమనిస్తే అనేక అంశాలు వెలుగులోకి వస్తాయి.

1992 రెండు ఫోన్లు మాత్రమే లాంచ్ అయ్యాయి

మోటోరాలా ఫోన్ 8 మిలియన్ల అమ్మకాలు అలాగే నోకియా 101 5 మిలియన్ల అమ్మకాలు జరిగాయి.

1996వ సంవత్సరంలో

మోటోరోలా నుంచి వచ్చిన స్టార్ టాక్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. దాదాపు 60 మిలియన్ల అమ్మకాలను సాధించింది.

1998 నోకియాదే...

నోకియా నుంచి ఈ ఏడాది వచ్చని ఫోన్ చరిత్రను తిరగరాసింది. నోకియా 6210 ఫోన్ 21 మిలియన్ల అమ్మకాలను సాధించింది. 2001 దాకా ఈ ఫోన్ దే హవా. 1998లో బెస్ట్ సెల్లింగ్ ఫోన్ గా కూడా నిలిచింది.

1999లో నోకియా 3210

జీఎస్‌ఎమ్ నెట్‌వర్క్ సపోర్ట్‌తో వచ్చిన ఈ మొబైల్ 1999లో మార్కెట్ చరిత్రను తిరగరాసింది. 150 మిలియన్ల అమ్మకాలను సాధించింది.

2000లో నోకియా 3310, 8890

ఈ సంవత్సరంలో నోకియా నుంచి దూసుకొచ్చన 3310 ఫోన్ 126 మిలియన్ల మేర అమ్మకాలను సాధించింది.

2002లో 5 ఫోన్లు సంచలనం

ఆ ఏడాది నోకియా నుంచి వచ్చిన 5 కంపెనీల ఫోన్లు మార్కెట్ ను శాసించాయి. ఒక్కో ఫోన్ 12 మలియన్ల అమ్మకాలను సాధించింది. వాటిలో నోకియా 6100 15 మిలియన్లు, నోకియా 6610 15 మిలియన్లు,నోకియా 3510 15 మిలియన్లు, సీమెన్స్ ఎ50 15 మిలియన్లు, శాంసంగ్ ఎస్ జీ హెచ్ టీ 100 12 మిలియన్ల మేర అమ్మకాలు జరిగాయి. నోకియా ఫస్ట్ కలర్ ఫోన్ ఇదే సంవత్సరంలో వచ్చింది.

ఫస్ట్ కెమెరా ఫోన్ 2003

నోకియా నుంచి వచ్చిన 1100 250 మిలియన్ల మేర అమ్మకాలు జరిగాయి. నోకియా 6600 ఫస్ట్ కెమెరా ఫోన్ 2 మిలియన్ల యూనిట్లు అమ్ముడుపోయాయి.

2004 నోకియాదే రాజ్యం

ఈ సంవతస్రంలో నోకిమా దాదాపు 500 మిలియన్లకు పైగానే ఫోన్లను అమ్మకాలు జరిపింది. అయితే మోటోరోలా కూడా నోకియాకు ధీటుగా మార్కెట్లో అమ్మకాలు సాధించింది. ఈ కంపెనీ నుంచి వచ్చిన RAZR V3 130 మిలియన్ల యూనిట్లు అమ్మకాలు జరిగాయి.

2005 నోకియా ఎన్ 70

నోకియా నుంచి ప్రపంచంలో తొలిసారిగా ఫస్ట్ స్మార్ట్ పోన్ రిలీజయింది ఈ ఏడాదే. ఈ సంవత్సరంలో నోకియా అమ్మకాలు 100 మిలియన్లకు పై మాటే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 8 Will Be The King In Smartphone Industry?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot