మిస్టర్ నోకియా ఫ్లాప్ షో..?

Posted By: Staff

 మిస్టర్ నోకియా ఫ్లాప్ షో..?

 

నాలుగు నెలల క్రితం అట్టహాసంగా మార్కెట్లోకి విడుదలైన ‘నోకియా లూమియా 800’ ఫేలవమైన పనితీరుతో వినియోగదారులను నిరుత్సాహాపరిచింది. ఈ ఫోన్ బ్యాటరీ జీవితకాలం పై అనేక ఫిర్యాదులు యాజమాన్యానికి అందాయి. ఫెయిల్యూర్‌కు గల కారణాలను పరిగణలోకి తీసుకన్న నోకియా యుద్ధ ప్రాదిపదికన సమస్య నివారణ చర్యలు చేపట్టింది. తొలి దశలో భాగంగా చేపట్టిన నవీకరణ అసలుకే ఏసరు తెచ్చినట్లుగా డివైజ్ డిస్‌ప్లేను డిమ్ చేసింది. మరో ప్రయత్నంగా నోకియా తాజగా

తెచ్చిన అప్‌డేట్ అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వైఫల్యానికి గల కారణాలను కొనుగొనే వేటలో పరిశోధనలు ప్రారంభించిన నోకియా చివరకు సమస్యకు గల కారణం బ్యాటరీ కాదని నిర్థారించింది. ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని తేటతెల్లం చేసింది. ఈ అంశం పై నోకియా ఇండియా స్పందిస్తూ భారత్‌లో దిగుమతైన ‘లూమియా 800’ స్మార్ట్ ఫోన్‌లలో ఏ విధమైన లోపాలు లేవని స్పష్టం చేసింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot