నోకియా వరల్డ్ ఈవెంట్‌కు ముందే నోకియా 800 ప్రదర్శన

Posted By: Staff

నోకియా వరల్డ్ ఈవెంట్‌కు ముందే నోకియా 800 ప్రదర్శన

నోకియా వరల్డ్ ఈవెంట్లో విడుదల చేయనున్న, నోకియా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నోకియా మొట్టమొదటి విండోస్ ఫోన్ 'నోకియా 800'కి సంబంధించిన టీజర్స్ లండన్ టెలివిజన్‌లో దర్శనమిస్తున్నాయి. ఈ ఎడ్వర్టైజ్‌మెంట్‌ని నోకియా ప్రముఖ రియాలిటీ టివి షో ఎక్స్ ప్యాక్టర్‌లో బ్రేక్ టైమ్‌లో వచ్చేలా ఏర్పాట్లు చేసింది. నోకియా కొత్తగా విడుదల చేయనున్న ఈ విండోస్ స్మార్ట్ ఫోన్‌కి 'నోకియా 800'గా నామకరణం చేయడం జరిగింది.

ఇక ఈ టివి ఎడ్వర్టైజ్ మెంట్‌లో నోకియా కొత్త విండోస్ స్మార్ట్ ఫోన్ నోకియా 800ని కేవలం నాలుగు యాంగిల్స్‌లో మాత్రమే వచ్చేలా చూపించి, చూపించినట్లుగా చూపిస్తుంది. నోకియా 800 విండోస్ స్మార్ట్ ఫోన్ సీ-రేతో పాటు, ఇంటర్నల్‌గా కోడ్‌నే‌మ్‌ని పెట్టడం జరిగింది. నోకియా సిఈవో స్టీవెల్ ఎలాప్ ఈ స్మార్ట్ ఫోన్‌ సమాచారాన్ని కంపెనీ మీటింగ్‌లో విడుదల చేయడం జరిగింది. ఈ మీటింగ్‌లో విడుదల చేయడానికి కారణం కూడా వెల్లడించారు. మైక్రోసాప్ట్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఇలా మీటింగ్‌లో చూపించాల్సి వచ్చిందని తెలిపారు.

ఇది ఇలా ఉంటే నోకియా వరల్డ్ ఈవెంట్ అక్టోబర్ 26న జరగనుంది. ఈ ఈవెంట్లో నోకియా కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్స్‌ని ప్రదర్శనకు ఉంచనుంది. నోకియా 800 విండోస్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ సమాచారాన్ని వన్ ఇండియా పాఠకుల కొసం అందివ్వడం జరుగుతుంది. నోకియా 800 విండోస్ ఫోన్‌కి సంబంధించిన సమాచారాన్ని మొదటగా మేము పాఠకులకు అందజేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం క్లుప్తంగా త్వరలో అందజేయడం జరుగుతుంది. నోకియా 800కి సంబంధించిన యాడ్‌ని చూడాలనుకుంటే ఈ లింక్(http://www.youtube.com/watch?feature=player_embedded&v=ScOq0bctscE)లో చూడండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot