విడుదలకు ముందే నోకియా 801 ఫీచర్స్ లీక్..

Posted By: Super

విడుదలకు ముందే నోకియా 801 ఫీచర్స్ లీక్..

ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా నెంబర్ వన్ అనడంలో ఎటువంటి సందేహాం లేదు. అందుకు కారణం నోకియా ప్రవేశపెట్టిన మొబైల్స్ ఇండియాలో ఉన్న సాధారణ మద్య తరగతి కుటుంబాల ప్రేమను చూరగోనడమే. నోకియా ఇప్పడు కొత్తగా మార్కెట్లోకి ఎన్నో మొబైల్స్‌ని ప్రవేశపెడుతూ వచ్చింది. నోకియా కొత్తగా 801 అనే హై ఎండ్ ఫీచర్స్ కలిగిన మొబైల్‌ని ప్రవేశపెట్టనుంది. నోకియా 801 మొబైల్‌లో అత్యంత విలువైన అడ్వాన్సడ్ టెక్నాలజీని నోకియా వాడినట్లు సమాచారం.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నోకియా యూజర్స్‌ని నోకియా 801 మొబైల్ అమితంగా ఆకట్టుకుంటుందని నోకియా ప్రతినిధులు తెలిపారు. నోకియా 801 మొబైల్ పుల్లీ లోడెడ్ 1.2 GHz Dual Core డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌తో విడుదల చేయడం జరుగుతుంది. ఇంత హై కాన్పిరేగషన్ ప్రాసెసర్ వాడడం వల్ల మల్టీమీడియా ఫంక్షన్స్‌ని ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. వీటితో పాటు నోకియా 801 మొబైల్ యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను 3.8 ఇంచ్ AMOLED టచ్ స్క్రీన్‌ని కలిగి ఉంది. ఈ టచ్ స్క్రీన్ సహాయంతో యూజర్స్ ఇమేజిలను ఎలా కావాలంటే అలా రోటేట్ చేయవచ్చు.

నోకియా 801 మొబైల్‌లో అత్యంత అధ్బుతమైన మరో ఫీచర్ ఏమిటంటే 16 మెగా ఫిక్సల్ కార్ల్ జీజ్ కెమెరాతో పాటు జినాన్ ఫ్లాష్‌ని కలిగి ఉంది. నోకియా ఇంతవరకు విడుదల చేసిన హ్యాండ్ సెట్స్‌లలో ఇలాంటి అత్యంత అధ్బుతమైన ఫీచర్స్‌ని అందించిన వేరే మొబైల్ లేదు. ఈ కెమెరా సహాయంతో అధ్బుతమైన ఇమేజిలను తీయవచ్చు. మొబైల్‌తో పాటు 16జిబి ఇంటర్నల్ మొమొరీ లభించగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మొమొరీని 32జిబి వరకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. మొమొరీ స్టోరేజి ఎక్కువగా ఉండడం వల్ల మీకు కావాల్సిన పాటలు, వీడియోలను అవలీలగా ఫోన్‌లో స్టోర్ చేసుకొవచ్చు.

నోకియా 801 మొబైల్ ఫీచర్స్ క్లుప్తంగా:

1.2 GHz Dual Core processor
3.8 inch AMOLED touch screen
16 megapixel Carl Zeiss Camera with Xenon Flash
HDMI Port, 16 GB Internal Memory.
1550 mAh non removable Li-Ion battery.

వీటితో పాటు నోకియా 801 మొబైల్‌ ముందు భాగంలో ఉన్న కెమెరా సహాయంతో వీడియో కాలింగ్ ఫచర్‌ని అందుబాటులోకి తీసుకురావచ్చు. కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్‌కి వస్తే బ్లూటూత్, వై-పైలను సపోర్ట్ చేస్తుంది. త్వరలో మార్కెట్లోకి రానున్న నోకియా 801 మొబైల్ తక్కువ బరువుతో అందంగా ఉండే విధంగా రూపోందించడం జరుగుతుందని సమాచారం. నోకియా 801 మొబైల్‌కి సంబంధించిన ఇమేజిని ప్రక్క చిత్రంలో చూడోచ్చు. ఇండియన్ మొబైల్ మార్కెట్లో నోకియా 801 మొబైల్ ధర సుమారుగా రూ 22,500గా ఉండవచ్చునని నిపుణులు అంచనా..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot