ఇంటర్నెట్లో 'నోకియా 801టి' హాల్ చల్

Posted By: Staff

ఇంటర్నెట్లో 'నోకియా 801టి' హాల్ చల్

 

ప్రపంచంలో మొబైల్ తయారీ సంస్దలలో మూడవ అతి పెద్ద మొబైల్ తయారీ సంస్ద నోకియా కార్పోరేషన్. ఎక్కువ నాణ్యత కలిగిన మొబైల్ ఫోన్స్‌ని విడుదల చేయడంలో నోకియాది అందవేసిన చేయి. నోకియా ఇప్పటి వరకు ప్రవేశపెట్టినటువంటి అన్ని మొబైల్ ఉత్పత్తులు కూడా నమ్మకానికి, నాణ్యతకు మరోపేరు. ఇండియా లాంటి దేశాలలో నోకియా మొబైల్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మండి.

అలాంటి మొబైల్ అభిమానుల కొసం నోకియా ప్రత్యేకంగా కొత్త కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూ ఉంటుంది. ఇటీవన కస్టమర్స్‌కి నాణ్యమైన విండోస్ మొబైల్స్‌ని అందించేందుకు గాను మైక్రోసాప్ట్ సంస్దతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక నోకియా త్వరలో చైనాలో విడుదల చేయనున్న నోకియా 801టి మొబైల్‌కి సంబంధించిన సమాచారం ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తుంది. నోకియా 801టి సమాచారం వన్ ఇండియా పాఠకులకు ప్రత్యేకంగా అందివ్వడం జరుగుతంది

నోకియా 801టి మొబైల్ ప్రత్యేకతలను క్లుప్తంగా పరిశీలించినట్లేతే.. మొబైల్ బరువు 171 గ్రాములు. మొబైల్ చుట్టుకొలతలు 125.12 mm x 64.97 mm x 11.57 mm. పుల్ టచ్ స్క్రీన్ దీని సొంతం. నోకియా 801టి మొబైల్ జిఎస్ఎమ్‌తో పాటు, TD-SCDMA నెట్ వర్క్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. 4.3 ఇంచ్ స్క్రీన్ సైజు దీని సొంతం.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 8 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఎల్‌ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్ కెమెరా ప్రత్యేకత. ఇక నోకియా 801టి మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే సింబియన్ అన్నా లేదా సింబియన్ బెల్లీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇనిస్టాల్ చేయనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో నోకియా 801టి మొబైల్ ధరకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించ లేదు.

నోకియా 801టి మొబైల్ ప్రత్యేకతలు:

* Weight 171 (g)

* Size 125.12 × 64.97 × 11.57 (mm)

* Screen size 52.64 × 96.06 × 1.41 (mm); supports touch screen, TFT with 16 million colours

* Network frequency 900MHz, 1800MHz, 850MHz, 1900MHz

* 8MP camera

* 256 internal memory, Expandable with miniSD up to 32 GB

* Symbian ^ 3 OS

* Operating system: Symbian

* Wap 2.0, GPRS

* 3G Support, TD-SCDMA

* Phone memory 256MB

* E-mail Support, POP3/IMAP, Mail for Exchange

* Bluetooth, USB, WLAN

* GPS

* Mobile phone standard TD-SCDMA/GSM dual-mode

* Chinese input Handwriting, Pinyin, Stroke

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot