ఫోన్ కొంటే ఫ్రింటర్ ‘ఫ్రీ’

Posted By: Staff

ఫోన్ కొంటే ఫ్రింటర్ ‘ఫ్రీ’

దిగ్గజ మొబైల్ తయారీ బ్రాండ్ నోకియా ప్రతిష్టాత్మకంగా రూపొందించిన 41 మెగా పిక్సల్ ఫోన్ ‘నోకియా 808 ప్యూర్ వ్యూ’ ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్. భారత్ రిటైల్ మార్కెట్లో ఈ హైఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.31,999కి విక్రియిస్తున్నారు. ఈ నేపధ్యంలో ‘ఇండియాటైమ్స్ డాట్ కామ్’(Indiatimes.com) నోకియా 808 ప్యూర్ వ్యూ కొనుగోలు పై రూ.6,894 విలువ చేసే ఫైన్ ‘ప్లిక్స్ ఐపీ-10’ ఫ్రింటర్ ఉచితమంటూ ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ రిటైల్ సంస్త వెల్లడించిన సమాచారం మేరకు బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలోని స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ధర రూ.34,499. ఈ ఫోన్‌లోని హై రిసల్యూషన్ 41 మెగా పిక్సల్ కెమెరాను నోకియా, కార్ల్‌‌జిస్ ఆప్టిక్స్‌లు అభివృద్ధి చేసాయి.

నోకియా 808 ప్యూర్ వ్యూ ముఖ్య ఫీచర్లు:

4 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 360 x 640పిక్సల్స్),

1.3గిగాహెడ్జ్ ఆర్మ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

15జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

నోకియా బెల్లీ ఆపరేటింగ్ సిస్టం,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై,

జీపీఎస్ సపోర్ట్,

బ్లూటూత్,

41 మెగాపిక్సల్ కెమెరా,

1080పిక్సల్ హై క్వాలిటీ వీడియో రికార్డింగ్,

32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ,

1400mAh లియాన్ బ్యాటరీ.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot