ఆ అద్భుతానికి అవార్డుల వర్షం కురిసింది!!

Posted By: Prashanth

ఆ అద్భుతానికి అవార్డుల వర్షం కురిసింది!!

 

విమర్శకులను సైతం మొప్పించి ఉత్తమ అవార్డులను సొంతం చేసుకున్న స్మార్ట్‌ఫోన్ ‘నోకియా ప్యూర్ వ్యూ 808’ ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ మే నుంచి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రధమంగా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ప్రకటించారు. ఈ డివైజ్‌లో నిక్షిప్తం చేసిన 41 పిక్సల్ కెమెరా వ్యవస్థ అద్భుతాన్ని తలపిస్తుంది. ఈ ఫోన్‌లోని ఇమేజింగ్ ఇమేజింగ్ అల్గోరిథంలను నోకియా , కార్ల్ ‌జిస్ ఆప్టిక్స్‌లు అభివృద్ధి చేసాయి. ఈ ఫోన్‌లను తొలిగా భారత్, రష్యాలలో విక్రయించనున్నారు. మొబైల్ వర్డల్ కాంగ్రెస్‌లో ఉత్తమ మొబైల్ డివైజ్ అవార్డును ‘నోకియా ప్యూర్ వ్యూ’ దక్కించుకుంది.

నోకియా 808 ప్యూర్ వ్యూ ముఖ్య ఫీచర్లు:

4 అంగుళాల ఆమోల్డ్ క్లియర్ బ్లాక్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 360 x 640పిక్సల్స్),

1.3గిగాహెడ్జ్ ఆర్మ్ ప్రాసెసర్,

512ఎంబీ ర్యామ్,

15జీబి ఇంటర్నల్ స్టోరేజ్,

నోకియా బెల్లీ ఆపరేటింగ్ సిస్టం,

3జీ కనెక్టువిటీ,

వై-ఫై,

జీపీఎస్ సపోర్ట్,

బ్లూటూత్,

41 మెగాపిక్సల్ కెమెరా,

1080పిక్సల్ హై క్వాలిటీ వీడియో రికార్డింగ్,

32జీబి ఎక్స్ ప్యాండబుల్ మెమరీ,

1400mAh లియాన్ బ్యాటరీ.

కార్ల్‌జిస్ ఆప్టిక్స్‌తో కూడిన 41 మెగా పిక్సల్ సెన్సార్ సరికొత్త ఇమేజింగ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. హై డెఫినిషన్ క్వాలిటీతో కూడిన వీడియో రికార్డింగ్ నిర్వహించుకోవచ్చు. నిక్షిప్తం చేసిన డాల్బీ హెడ్‌ఫోన్ టెక్నాలజీ ఇంకా డాల్బీ డిజిటల్ ప్లస్ 5.1 సరౌండ్ సౌండ్ ప్లే బ్యాక్ వ్యవస్థలు అత్యుత్తమ ఆడియోను అందిస్తాయి. ఇండియన్ మార్కెట్లో ‘నోకియా ప్యూర్ వ్యూ 810’ ధర రూ.40,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot