ప్రీ ఆర్డర్లుకు వచ్చిన నోకియా 8110 4జి "బననా "ధర ఎంతంటే ?

By Anil
|

కొద్ది రోజుల క్రితమే నోకియా 8110 4జి "బననా " సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది . లజాడ అనే రిటైలర్ దీనిని $98( Rs. 4,900) అమ్మకానికి తీసుకొస్తున్నాడు. అమెజాన్ లో ప్రీ బుకింగ్స్ కూడా అయిపోయాయి.బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లతో తక్కువ బరువుతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంటరయింది. కాగా గూగుల్ యాప్స్, సర్వీసుతో పాటు జీమెయిల్, గూగుల్ మ్యాప్స్ గో లాంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. నోకియా ఫోన్ అంటే గుర్తొచ్చేది స్నేక్ గేమ్ అనే విషయం అందరికీ తెలిసిందే. అది కూడా ఈ మొబైల్ లో అందుబాటులో ఉంది.

 

జియోఫోన్‌ని Nokia 8110 సవాల్ చేస్తుందా, ప్రత్యేకతమైన ఫీచర్లు ఏంటీ..?జియోఫోన్‌ని Nokia 8110 సవాల్ చేస్తుందా, ప్రత్యేకతమైన ఫీచర్లు ఏంటీ..?

ప్రీ ఆర్డర్లుకు వచ్చిన నోకియా  8110 4జి

ఈ నోకియా 8110 4జి "బననా " పసుపు, నలుపు రంగులలో అందుబాటు లో ఉంది.అమెజాన్ యూకే లో ఈ ఫోన్ ధర £ 78.56(Rs. 7,040) పలుకుతుంది. కాగా ఇప్పటికే అమెజాన్ ప్రీ బుకింగ్స్ కూడా అయిపోయాయి.యూరోపియన్ దేశాలలో లో అమెజాన్ ప్రీ ఆర్డర్స్ మొదలు పెట్టింది . అతి త్వరలో మన దేశంలో కూడా ఈ నోకియా 8110 4జి "బననా " అందుబాటులోకి వస్తుందని నోకియా కంపెనీ తెలిపింది.

నోకియా 8110 4జీ ఫీచర్ ఫోన్ ఫీచర్లు
2.4 ఇంచ్ క్యూవీజీఏ డిస్‌ప్లే, 320 x 240 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.1 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ స్నాప్‌డ్రాగన్ 205 ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, ఎక్స్‌పాండబుల్ మెమొరీ, డ్యుయల్ సిమ్, కాయ్ ఓఎస్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), ఐపీ 52 డ్రిప్ ప్రొటెక్షన్, 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 4.1 ఎల్‌ఈ, యూఎస్‌బీ 2.0, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ.

నోకియా 8110 4జీ ఫోన్ 1.1Ghz dual-core Qualcomm 205 మొబైల్ ప్రాసెసర్ తో పాటు 512MB RAM/ 4GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది.అలాగే విస్తరణ సామర్ధ్యం కూడా ఉంది. 2 ఎంపీ కెమెరాతో పాటు 1,500mAh battery ఉంది. అలాగే 4జీ వోల్ట్ కనెక్షన్ మీద 9.32 గంటల పాటు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

ప్రీ ఆర్డర్లుకు వచ్చిన నోకియా  8110 4జి

నోకియా బనానా ఫోన్ సొంత యాప్స్ తో వచ్చింది. Facebook, Twitter, Google Maps, Google Assistan, Snakeగేమ్ లాంటివి ఇందులో ఉన్నాయి. ధర్డ్ పార్టీ యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సప్ కూడా ఇందులో వస్తోంది. ఇంకా మరిన్ని ఫీచర్లను అందుబాటలోకి తీసుకువస్తామని HMD చెబుతోంది.డిజైన్లో నోకియా 8110 స్టైలిష్ గా కనిపిస్తుంది. స్లైడర్ దగ్గర నుంచి కీ బోర్డ్ దాకా అంతా అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.

Best Mobiles in India

English summary
Nokia 8110 4G 'Banana' Phone Finally Goes on Sale in European markets more news At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X