రివ్యూ టైం, నోకియా 8110 4జీ 'బనానా ఫోన్' vs జియో ఫోన్ 2 !
హెచ్‌ఎండీ గ్లోబల్ కొత్త నోకియా ఫోన్ ను భారత్‌లో లాంచ్ చేసింది. నోకియా 8110 4జీ 'బనానా ఫోన్' పేరుతో మార్కెట్లికి తీసుకొచ్చింది.
హెచ్‌ఎండీ గ్లోబల్ కొత్త నోకియా ఫోన్ ను భారత్‌లో లాంచ్ చేసింది. నోకియా 8110 4జీ 'బనానా ఫోన్' పేరుతో మార్కెట్లికి తీసుకొచ్చింది. రూ.5,999కు లాంచ్ చేసిన ఈ బనానా ఫోన్ అక్టోబర్ 24 నుంచి అందుబాటులోకి రానుంది.ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కీ పోటీ పడే ఫోన్ ఏదైనా ఉందా అంటే అది జియో ఫోన్ 2 అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ ఫోన్ కూడా 'బనానా ఫోన్' లో గల ఫీచర్లే ఇందులో కూడా ఉన్నాయి. ఒకే రేంజ్ ఫీచర్లు గల 'బనానా ఫోన్' మరియు జియో ఫోన్ 2 ఫోన్లు కస్టమర్లను ఏ మేర సంతృప్తిపరుస్తున్నాయి. వీటిలో ఏది కస్టమర్లకు డబ్బుకు న్యాయం చేస్తుందనే దాని మీద మీకు స్పెషల్ రివ్యూ అందిస్తున్నాం. మరి వీటి రెండిట్లో మీకు నచ్చిన ఫోన్ అలాగే మీ డబ్బులకు న్యాయం చేస్తే ఫోన్ ఏదో మీరే డిసైడ్ చేసుకోండి.

రెండు ఫీచర్ ఫోన్లు ఒకే ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తాయి : KaiOS
ఈ రెండు ఫీచర్ ఫోన్లు KaiOS ఆధారిత స్మార్ట్ ఫీచర్ ఓఎస్‌తో రన్ అవుతాయి .

జీయోఫోన్ 2 మరియు నోకియా 8110 4G రెండు SIM కార్డు స్లాట్లు సపోర్ట్ చేస్తాయి..
ఈ రెండు ఫోన్లు డ్యూయల్ SIM కార్డులను సపోర్ట్ చేస్తాయి. జీయోఫోన్ 2 రెండు నానో-సిమ్ కార్డులతో పనిచేయగలదు, నోకియా 'బనానా ఫోన్' మైక్రో మరియు నానో సిమ్ కార్డుపై పనిచేయగలదు. అయితే JioPhone 2 కి Jio సిమ్ కార్డులకు మాత్రమే లాక్ చేయబడిన మొట్టమొదటి కార్డ్ స్లాట్ ఉంది

ఒకటే RAM సామర్థ్యం...
అల్ట్రా-బడ్జెట్ ఫీచర్ ఫోన్లు, జీయోఫోన్ 2 మరియు నోకియా 8110 4G రెండింటికి ఒకటే RAM సామర్థ్యం - 512MB.

సేమ్ QVGA డిస్‌ప్లే
జియో ఫోన్ 2 మరియు నోకియా 8110 4G 2.4-అంగుళాల QVGA డిస్‌ప్లేని కలిగి ఉంటాయి

నోకియా 8110 ప్రాసెసర్ స్పెక్స్ విషయంలో కొంచెం బెటర్..
క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 205 ప్రాసెసర్ ఆన్బోర్డ్ను కలిగి ఉన్న నోకియా 8110 ప్రాసెసింగ్ పవర్ పరంగా జీయోఫోన్ 2 ను డీ కొట్టింది. జీయోఫోన్ 2 ప్రత్యేకమైన 1.1GHz డ్యూయల్ కోర్ ప్రాసెసర్ను కలిగి ఉంది.

జియో ఫోన్ 2 హై ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ ను కలిగి ఉంది...
జియో ఫోన్ 2 మరియు నోకియా 8110 4జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ని కలిగి ఉంటాయి. అయితే నోకియా 8110 32GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కు మద్దతు ఇవ్వగా జియో ఫోన్ 2 128GB ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ కు మద్దతు ఇస్తుంది.

జీయోఫోన్ 2 నోకియా 8110 కన్నా మెరుగైన ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని కలిగి ఉంది...
జియో ఫోన్ 2 లో 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉండగా నోకియా 8110 లో మాత్రం 2 మెగా పిక్సల్ రేర్ కెమెరా విత్ LED ఫ్లాష్ కలిగి ఉంది.

జీయోఫోన్ 2 నోకియా 8110 4G కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది...
నోకియా 8110 ఫోన్ 1500mah బ్యాటరీ కలిగి ఉంది అయితే జియో ఫోన్ 2 లో 2000mah బాటరీ ని కలిగి ఉంది.

ధర..
జీయోఫోన్ 2 ధర రూ .2,999గా ఉంది.
నోకియా 8110 ధర రూ.5,999గా ఉంది.
రిజల్ట్ :బడ్టెట్, ఫీచర్లు పరంగా జియో ఫోన్ 2 నోకియా 8110 కంటే కొంచెం బెటర్.


Click it and Unblock the Notifications








