5 కెమెరాలతో Nokia 9.3 Pureview ,ఇంకా మరిన్ని కెమెరా ఫీచర్లు

By Gizbot Bureau
|

గతంలో కెమెరాను హైలెట్ చేస్తూ నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి విదితమే. ఇప్పుడు దానికి తర్వాతి వెర్షన్‌గా నోకియా 9.3 ప్యూర్‌వ్యూ స్మార్ట్‌‌ఫోన్ ను లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఎన్నో లీకులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా వచ్చిన లీక్ ఈ ఫోన్ మీదున్న అంచనాలను మరింత రెట్టింపు చేసేలా ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ ప్లే, 108 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న కెమెరాను ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది.

కెమెరా పైనే నోకియా దృష్టి

కెమెరా పైనే నోకియా దృష్టి

నోకియా 9 ప్యూర్ వ్యూ తరహాలో ఇందులో కూడా కెమెరా పైనే నోకియా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ లో వెనకవైపు అందించే కెమెరాల్లో ఒక కెమెరాకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్(ఓఐఎస్) ఫీచర్ ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరగాల్సిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లోనే ఈ ఫోన్ ను లాంచ్ చేయాలని నోకియా మొదట భావించింది. అయితే కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం రద్దయింది.

108 మెగా పిక్సెల్ సెన్సార్

108 మెగా పిక్సెల్ సెన్సార్

ఈ స్మార్ట్ ఫోన్ లో శాంసంగ్ 108 మెగా పిక్సెల్ సెన్సార్ లేదా సోనీ 64 మెగా పిక్సెల్ సెన్సార్ ను అందించనున్నట్లు మరో టిప్ స్టర్ తెలిపారు. ఈ ఫోన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ను కూడా సపోర్ట్ చేయనుందని ఈ టిప్ స్టర్ తెలిపారు. కాకపోతే దీన్ని ఒక కెమెరా మాత్రమే సపోర్ట్ చేయనుంది.

120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ 

120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ 

దీనికితోడు ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ ఫోన్లలో కనిపిస్తున్న 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉండనుందని తెలిపారు. నోకియా 9.3 ప్యూర్ వ్యూకి మొత్తం 10 ప్రోటో టైపులను నోకియా రూపొందించిందని 20 మెగా పిక్సెల్, 24 మెగా పిక్సెల్, 48 మెగా పిక్సెల్ సెన్సార్లను కూడా పరీక్షిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.

సంవత్సరం చివరిలో లాంచ్ అయ్యే అవకాశం

సంవత్సరం చివరిలో లాంచ్ అయ్యే అవకాశం

కరోనావైరస్ కారణంగా సప్లై చైన్ కూడా దెబ్బతినడంతో ఈ నోకియా 9.3 ప్యూర్ వ్యూ స్మార్ట్ ఫోన్ ఈ సంవత్సరం మధ్యలో లేదా సంవత్సరం చివరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

Best Mobiles in India

English summary
Nokia 9.3 PureView with five cameras including 108MP sensor is coming soon

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X