నోకియా 9 ఇదే, ఊపేస్తోన్న కొత్త ఫోన్

నోకియా నుంచి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రాబోతోన్నట్లు సమాచారం. నోకియా 9 పేరుతో రానున్న ఈ ఫోన్ గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్‌కు సంబంధించిన ప్రోటోటైప్ వర్షన్ frandroid.comలో హల్‌చల్ చేస్తోంది. ఈ పబ్లికేషన్ రివీల్ చేసిన వివరాల ప్రకారం నోకియా 9 స్పెసిఫికేషన్స్ దుమ్మురేపేలా ఉన్నాయి..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు టైప్-సీ పోర్టు

లీకైన స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తేంటే... నోకియా 9 ఫోన్ 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్‌తో పాటు టైప్-సీ పోర్టులను కూడా సపోర్ట్ చేయబోతోంది. ఈ ఫోన్‌కు సంబంధించిన ఫిజికల్ హోమ్ బటన్‌లో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఎంబెడ్ చేసి ఉంచినట్లుగా రూమర్స్ చెబుతున్నాయి.

డిస్‌ప్లే

లీకైన స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తేంటే... నోకియా 9 ఫోన్ 5.27 అంగుళాల QHD డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఈ డిస్ ప్లే రిసల్యూషన్ 1440x2560 పిక్సల్స్‌గా ఉంటుందట.

ప్రాసెసర్స్, ర్యామ్, స్టోరేజ్

లీకైన స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తేంటే... నోకియా 9 ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అందులో ఒకటి 4జీబి, మరొకటి 6జీబి. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్ 64జీబి నేటివ్ స్టోరేజ్‌తో వస్తుంది.

సాఫ్ట్‌వేర్ ఇంకా కెమెరా

లీకైన స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తేంటే... నోకియా 9 ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అువుతంది. కెమెరా విషయానికి వస్తే నోకియా 9 ఫోన్ డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఫోన్ వెనుక కెమెరాలు రెంటు 13 ఎంపీ కెమెరాలను సెటప్ చేసినట్లు తెలుస్తోంది.

క్విక్ ఛార్జ్ టెక్నాలజీ

లీకైన స్పెసిఫికేషన్స్ బట్టి చూస్తేంటే... నోకియా 9 ఫోన్ లో నిక్షిప్తం చేసే బ్యాటరీ క్విక్ ఛార్జ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తు్ంది. ఈ ఫోన్‌తో వచ్చే క్విక్‌ఛార్జ్ 3.0 ఛార్జర్ వేగవంతమైన పనితీరును కనబరుస్తుంది. హై-క్వాలిటీ-ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్‌లను కూడా నోకియా ఆఫర్ చేయబోతోన్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 9 confirmed: Images and specs leaked. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot