ఉత్కంఠ రేపుతోన్న Nokia 9 స్మార్ట్‌ఫోన్

నోకియా బ్రాండెడ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టిన హెచ్‌ఎండి గ్లోబల్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నట్లు సమాచారం. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2017 వేదికగా హెచ్‌ఎండి గ్లోబల్ ఆవిష్కరించిన నోకియా 3, నోకియా 5, నోకియా 6 (గ్లోబల్ వేరియంట్) ఇంకా నోకియా 3310 (2017) మోడల్ ఫోన్‌లు ఏప్రిల్-జూన్‌ల మధ్య మార్కెట్లో విడుదల కాబోతున్నాయి.

Read More : జియో ప్రైమ్ యూజర్లు రూ.499 ప్లాన్ తీసుకుంటే..?</p>

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు

(కాన్సెప్ట్ ఇమేజ్)

తాజాగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం రానున్న నెలల్లో సామ్‌సంగ్, యాపిల్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు పోటీగా రెండు హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లను నోకియా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఈ ఏడాదిలో నోకియా నుంచి 6 లేదా 7 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో రిలీజ్ అయ్యే అవకాశముంది.

రూ.2,999 ధరతో మరో 4G VoLTE స్మార్ట్ ఫోన్ వచ్చేసింది

Nokia 9 అని తెలుస్తోంది

(కాన్సెప్ట్ ఇమేజ్)

నోకియా పవర్ యూజర్ తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేయబోతోన్న మొదటి నోకియా ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ Nokia 9 అని తెలుస్తోంది. ఐరిస్ స్కానర్, ఐపీ68 సర్టిఫికేషన్, 5.5 అంగుళాల క్యూహైడెఫిపిషన్ OLED స్ర్ర్కీన్ వంటి విప్లవాత్మక ఫీచర్లతో రాబోతోన్న ఈ ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎల్‌జీ జీ6 వంటి ప్రముఖ ఫోన్‌లకు ప్రధాన పోటీదారుగా నిలుస్తుందట.

జమ్ము- శ్రీనగర్‌ సొరంగ మార్గం, 124 అత్యాధునిక కెమెరాలతో నిరంతర నిఘా

శక్తివంతమైన ఫీచర్లు..

(కాన్సెప్ట్ ఇమేజ్)

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 835 చిప్‌సెట్, 6జీబి ర్యామ్, అడ్రినో 540 జీపీయూ, 64జీబి లేదా 128జీబి స్టోరేజ్ కెపాసిటీ, మైక్రోఎస్డీ స్లాట్, 22 మెగా పిక్సల్ Carl-Zeiss డ్యుయల్ రేర్ కెమెరా, 12 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 3800mAh బ్యాటరీ విత్ క్వాల్కమ్ క్విక్ ఛార్జ్ 4.0 టెక్నాలజీ వంటి శక్తివంతమైన ఫీచర్లతో నోకియా 9 ఫోన్ రాబోతుందని రూమర్ మిల్స్ చెబుతున్నాయి.

లీకైన జియో సెట్ టాప్ బాక్స్ ఫోటోలు

Nokia OZO ఆడియో టెక్నాలజీతో

(కాన్సెప్ట్ ఇమేజ్)

మరో రూమర్ ప్రకారం, నోకియా 9 స్మార్ట్ ఫోన్ విప్లవాత్మక Nokia OZO ఆడియో టెక్నాలజీతో రాబోతోందట. ఈ టెక్నాలజీ 3డీ ఆడియో ఎక్స్ పీరియన్స్ తో పాటు స్పాటియల్ ఆడియో ప్లేబ్యాక్ వ్యవస్థను సృష్టించగలదట. వీఆర్ అనుభూతులతో పాటు హై-క్వాలిటీ స్టీరియో ప్లేబ్యాక్‌ను OZO ఆడియో ప్లే బ్యాక్ సపోర్ట్ ద్వారా పొందవచ్చట.

8జీబి ర్యామ్‌తో OnePlus 5

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 9 full specs are out: Iris scanner, OLED display, Carl Zeiss optics and more. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot