భారీ బ్యాటరీ, 8 కెమెరాలు, సంచలనం రేపుతున్న నోకియా 9
హెచ్‌ఎండీ గ్లోబల్ బ్రాండ్ నోకియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించబోతోంది.
హెచ్‌ఎండీ గ్లోబల్ బ్రాండ్ నోకియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించబోతోంది. టెక్ ప్రియులను ఉర్రూతలూగించచడానికి భారీ బ్యాటరీతో పాటు 8 కెమెరాలతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. నోకియా 9 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతుందని తెలుస్తోంది. తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఇమేజ్‌లు పలు సోషల్ మీడియా వెబ్‌సైట్లలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ ఇమేజ్లతో నోకియా 9 స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద బ్యాటరీతో మార్కెట్‌లోకి వస్తుందని తెలుస్తోంది. అదేవిధంగా వెనుకవైపు పెంటా-లెన్స్(ఐదు లెన్స్‌ల) కెమెరా సెటప్‌ను ఇది కలిగి ఉందని సమాచారం.

నోకియాపవర్‌యూజర్ వెబ్‌సైట్..
చైనాకు చెందిన ఓ సర్టిఫికేషన్ సైట్‌లో కూడా ఈ స్మార్ట్‌ఫోన్ స్పాట్ అయింది. నోకియాపవర్‌యూజర్ వెబ్‌సైట్ కూడా నోకియా 9 లైవ్ ఇమేజ్‌ను లీక్ చేసింది.

నోకియా 9లో మొత్తంగా 8 కెమెరాలు..
అంతకముందు ఈ ఫోన్‌లో ముందువైపు మూడు కెమెరాలుండనున్నట్లు రిపోర్టులు తెలిపాయి. కానీ తాజా లీకేజీల ద్వారా నోకియా 9లో వెనుక వైపు ఐదు, ముందు వైపు మూడు కెమెరాలు ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నోకియా 9లో మొత్తంగా 8 కెమెరాలున్నట్లు సమాచారం.

4,150ఎంఏహెచ్ బ్యాటరీ ..
ఈ ఫోన్ 4,150ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం. అది నాన్ రిమూవబుల్ బ్యాటరీ అని సమాచారం.

వెనుకవైపు నీలం..
ఈ లీక్డ్ డివైజ్ వెనుకవైపు నీలంగా ఉంది. అంటే నోకియా 9 కలర్ ఆప్షన్లలో నీలం రంగు ఒకటని తెలుస్తోంది.

ఈ నెలాఖరులో..
హెచ్‌ఎండీ గ్లోబల్ నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు నుంచి ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఈ నెలాఖరులో ఫోన్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయి.

ఆండ్రాయిడ్ పై..
ఫీచర్ల విషయానికొస్తే.. నోకియా 9 'ఆండ్రాయిడ్ పై' ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుందని అంతకముందు రిపోర్టులు వచ్చాయి.

6.01 అంగుళాల డిస్‌ప్లే..
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 6.01 అంగుళాల డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌ఓసీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ మెమరీ తదితర ఫీచర్లు ఉండనున్నాయట.


Click it and Unblock the Notifications








