ఆ ఫోన్లను సవాల్ చేస్తూ నోకియా 9 వచ్చేస్తోంది..

Written By:

నోకియా స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలోకి మరో కొత్త డివైస్ నోకియా 9 అడుగుపెట్టనుంది. దీంతో పాటు ఇంకా పలు రకాల మోడళ్లను ఈ ఏడాది మార్కెట్లోకి తీసుకురానుంది. హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థ ఫిబ్రవరిలో బార్సిలోనాలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 ప్రదర్శనలో ఓ ఈవెంట్ నిర్వహించనుందని , ఆ సంస్థ చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ జుహో సర్వికాస్ ట్విట్టర్‌లో వివరాలను వెల్లడించారు. ఫిబ్రవరిలో జరగనున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2018 ప్రదర్శనలో భాగంగా ఆ నెల 25వ తేదీన తాము ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు.

రూ.4 వేలకే బిగ్ బజార్‌లో Redmi 5A, ఫోన్ ఫీచర్లు, ఇతర డిస్కౌంట్లపై లుక్కేయండి !

ఈ ఈవెంట్లో నోకియా 9 ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ నోకియా 4, నోకియా 7 ప్లస్, నోకియా 1 ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఫోన్లను కూడా విడుదల చేయవచ్చని తెలుస్తున్నది. కాగా ఈఫోన్ హై ఎండ్‌ ఫీచర్స్‌లో స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచాన్ని శాసిస్తున్న ఐ ఫోన్‌, శాంసంగ్‌ గెలాక్సీ నోట్స్‌కు దీటుగా రానుందని సమాచారం.
నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్స్ అంచనా
స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్,
5.3 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ డిస్‌ప్లే,
2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్,
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో,
13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
8, 12 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
3,250 ఎంఏహెచ్‌ బ్యాటరీ
బూతీ ఎఫెక్ట్‌
ఓజెడ్‌ఓ ఆడియో ఫీచర్లు

English summary
Nokia 9 might be launched at MWC 2018 on February 25 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot