అవే నిజమైతే, నోకియా మళ్లీ నెం.1?

నోకియా నుంచి త్వరలో లాంచ్ కాబోతోన్న నోకియా 2, నోకియా 7, నోకియా 8, నోకియా 9 స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి మరికొన్ని ఆసక్తికర వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. ఈ లీక్స్ గనుక నిజమైనట్లయితే త్వరోలో లాంచ్ కాబోతోన్న నోకియా 2 స్మార్ట్‌ఫోన్ Snapdragon 212 ప్రాసెసర్‌తో రాబోతోంది. ఈ విధమైన ప్రాసెసర్‌లను ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించటం జరుగుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Snapdragon 430 ప్రాసెసర్‌తో నోకియా 5

మరో ఫోన్ నోకియా 5 Snapdragon 430 ప్రాసెసర్‌తో రాబోతోంది. ఈ విధమైన ప్రాసెసర్‌లను మిడ్-రేంజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో వినియోగించటం జరుగుతోంది. తరువాతి మోడల్ అయిన నోకియా 7 Snapdragon 630 ప్రాసెసర్‌తో రాబోతోంది. ఈ విధమైన ప్రాసెసర్‌లను మిడ్-రేంజ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించటం జరుగుతోంది.

నోకియా 8 Snapdragon 660 ప్రాసెసర్‌తో

చైనా మీడియా లీక్ చేసిన వివరాల ప్రకారం నోకియా 8 స్మార్ట్‌ఫోన్ Snapdragon 660 ప్రాసెసర్‌తో రాబోతోంది. ఈ విధమైన ప్రాసెసర్‌లను హై-ఎండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించటం జరుగుతోంది.

Snapdragon 835 ప్రాసెసర్‌తో నోకియా 9

ఈ లీక్స్ ప్రకారం నోకియా హై-ఎండ్ ఫోన్‌గా భావిస్తోన్న నోకియా 9 శక్తివంతమైన Snapdragon 835 ప్రాసెసర్‌తో రాబోతోంది. ఈ మొత్తం ఫోన్‌లను బెర్లిన్‌లో జరిగే IFA 2017 గ్లోబల్ మార్కెట్స్ ఎగ్జిబిషన్‌లో భాగంగా హెచ్‌ఎండి గ్లోబల్ లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ కార్యక్రమం సెప్టంబర్ 1న ప్రారంభమైన సెప్టంబర్ 6న ముగుస్తుంది.

2017 ప్రధమర్థాన్ని లక్ష్యంగా చేసుకుని..

నోకియా నుంచి మార్కెట్లో లాంచ్ అయిన నోకియా 3310 (2017 వర్షన్), నోకియా 3, నోకియా 5, నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌లు అంచనాలకు తగట్టుగానే దూసుకెళుతున్నాయి. ఇప్పుడు మనం దాదాపుగా 2017 ద్వితియార్థంలోకి వచ్చేసాం. ఈ నేపథ్యంలో రెండవ విడత నోకియా స్మార్ట్‌ఫోన్‌లను కూడా మార్కెట్లో లాంచ్ చేసేందుకు హెచ్‌‌ఎండి గ్లోబల్ సిద్థంగా ఉన్నట్లు తెలుస్తోంది.

వన్‌ప్లస్ 5, ఐఫోన్ 7, గెలాక్సీ ఎస్ 8 ఫోన్‌లకు పోటీగా...

హెచ్‌‌ఎండి గ్లోబల్ మార్కెటింగ్ డైరెక్టర్ పెక్కా రంటాలా ఓ ఫిన్నిష్ పబ్లికేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా నోకియా ఫోన్ కొత్త లాంచ్‌లకు సంబంధించి ఆసక్తికర వివరాలను రివీల్ చేసారు. ఈయన వెల్లడించిన వివరాల ప్రకారం.. నోకియా 9, నోకియా 8, నోకియా 7, నోకియా 2 స్మార్ట్‌ఫోన్‌లు విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో నోకియా 9 మోడల్ వన్‌ప్లస్ 5, ఐఫోన్ 7, గెలాక్సీ ఎస్ 8 ఫోన్‌లకు పోటీగా నిలవనుందని సమచారం.

అన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ..

లో-ఎండ్, మిడ్ - రేంజ్, హై -ఎండ్ ఇలా వర్గాలను టార్గెట్ చేసే విధంగా ఈ నోకియా ఫోన్‌లు ఉంటాయని తెలుస్తోంది. వీటితో పాటు నోకియా3310 (2017 వర్షన్)ను 3జీ వేరియంట్‌లో కూడా లాంచ్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

నోకియా 9 రూమర్ స్పెసిఫికేషన్స్..

5.3 అంగుళాల క్వాడ్-హైడెఫినిషన్ డిస్ ప్లే, Snapdragon 835 చిప్ సెట్‌, 13 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ర్యామ్, ఈ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.45,000 వరకు ఉండొచ్చు.

నోకియా 8 రూమర్ స్పెసిఫికేషన్స్

క్వాల్కమ్ సరికొత్త Snapdragon 660 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ర్యామ్ వేరియంట్స్(4జీబి,8జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

నోకియా 7 రూమర్ స్పెసిఫికేషన్స్....

5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ Snapdragon 630 ప్రాసెసర్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 24 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000mAh బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Nokia 9, Nokia 8, Nokia 7 and Nokia 2 processors revealed by new leak. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot